అంతర్జాతీయం

విమర్శించే మీడియాకు వేధింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 21: భారతదేశంలో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే మీడి యా సంస్థలపై ఒత్తిడి పెరుగుతోందని, వేధింపులు ఎక్కువవుతున్నాయని అమెరి కా విదేశాంగ విభాగం మానవ హక్కులకు సంబంధించి తాజాగా రూపొందించిన నివేదికలో స్పష్టం చేసింది. ప్రభుత్వాన్ని విమర్శించిన మీడియా సంస్థలు 2017లో ఈ రకమైన పరిస్థితులను ఎదుర్కొన్నాయ ని ఈ నివేదికలో పేర్కొన్న ట్రంప్ ప్రభు త్వం ‘్భరత రాజ్యాంగం వాక్ స్వాతంత్య్రాన్ని భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పిస్తున్నప్పటికీ ఇందులో పత్రికా స్వేచ్ఛకు సం బంధించిన ప్రస్తావన స్పష్టంగా లేదు’ అని తెలిపింది. ప్రభుత్వాన్ని విమర్శించే మీడి యా సంస్థలు వేధింపులకు గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయని వెల్లడించింది. వివిధ దేశాల్లో మానవ హక్కుల పరిస్థితులను విశే్లషిస్తూ వార్షికంగా అమెరికా విదేశాంగ విభాగం ఈ నివేదిక రూపొందిస్తుం ది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో మా నవ హక్కుల పరిస్థితి కొంత మెరుగ్గా ఉం దని స్పష్టం చేసింది. అయితే పత్రికా స్వా తంత్య్రంపై మాత్రం దాడులు జరిగిన సం దర్భాలు ఎన్నో ఉన్నాయని వెల్లడించింది. తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న అమెరికా పత్రికలపై అణిచివేత ధోరణిని అవలంబిస్తున్నారంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారన్న ట్రంప్ ప్రభుత్వం భారత్‌లో పత్రికా స్వేచ్ఛకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పడం విడ్డూరమేనన్న వ్యా ఖ్యలు ఎదురవుతున్నాయి.