అంతర్జాతీయం

వర్క్ పర్మిట్లకు ఇక ఫుల్‌స్టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 24: హెచ్-1బి వీసాదారుల జీవిత భాగస్వాములకు జారీ చేసే వర్క్ పర్మిట్ వీసా (హెచ్4)లను అమెరికా నిలిపివేయనుంది. ఈ ప్రతిపాదనను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ఇప్పటికే సిద్ధం చేసినట్టు సమాచారం. ఫెడరల్ రాజ్యాంగంలోని ఉన్నతాధికారి ఒకరు ఒక శాసనకర్తకు లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేశారని అంటున్నారు. అయితే, ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే వర్క్ పర్మిట్లతో యూఎస్‌లో కొనసాగుతోన్న లక్షమంది భారతీయులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదన్న ఆందోళన మళ్లీ మొదలైంది. ఈ వేసవి నుంచే
ఈ ప్రతిపాదన నిర్ణయరూపం తీసుకుని అమల్లోకి రావొచ్చని సెనెటర్ చుక్ గ్రాస్లీకి యూఎస్ పౌరసత్వం, వీసా సేవల విభాగం (యుఎస్‌సిఐఎస్) డైరెక్టర్ ప్రాన్సిస్ సిస్నా రాసిన సాధారణ లేఖలో తెలియచేసినట్టు సమాచారం. ‘వర్క్ పర్మిట్ల (హెచ్-4) వీసాలపై ప్రస్తుత విధానాన్ని రద్దు చేసి, 2015నాటి పాత నిబంధననే అమల్లోకి తెచ్చే ఆలోచనలు సాగుతున్నాయి’ అంటూ సిస్నా, సెనెటర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నట్టు చెబుతున్నారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలోని నిబంధనలకు ఫుల్‌స్టాప్ పెట్టాలన్న ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బలమైన నిర్ణయం మూలంగా, వర్క్ పర్మిట్లతో యూఎస్‌లో ఉంటున్న 70వేల మంది భారతీయులు వెనక్కి వచ్చేసే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వృత్తి నైపుణ్యం కలిగివున్న హెచ్-1బి వీసాదారుల జీవిత భాగస్వాములు యూఎస్‌లో పని చేసేందుకు వీలుగా ఒబామా హయాంలో హెచ్-4 వీసాలు జారీ చేయడం తెలిసిందే. ఈ నిర్ణయం ఎక్కువ శాతం భారతీయులకు మేలు కలిగించింది. అయితే, ఒబామా హయాంలో జారీ చేసిన ప్రత్యేక ఉత్తర్వుకు చెక్ పెట్టేందుకు ట్రంప్ యంత్రాంగం ఎప్పటినుంచో ప్రయత్నిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ వేసవి నుంచే హెచ్-4 వీసాలను నిలుపుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.