అంతర్జాతీయం

‘ఉగ్ర’దేశాలకు బుద్ధి చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఏప్రిల్ 24: మానవ హక్కులకు శత్రువుగా మారిన ఉగ్రవాదంపై పోరాటం చేయాలని భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మంగళవారం ఇక్కడ పిలుపునిచ్చారు. షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సుకు హాజరైన సుష్మా వివిధ దేశాల విదేశాంగ మంత్రులకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదులకు మద్దతు, ప్రోత్సాహం, ఆర్థిక సహాయం అందిస్తున్న దేశాలను కట్టడి చేయాలని పాక్‌ను ఉద్దేశించి ఆమె స్పష్టం చేశారు. ఎస్‌సీఓ వేదికపై పాక్ విదేశాంగ మంత్రి ఖ్వాజా మహ్మద్ అసీఫ్ ఉండగానే సుష్మా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని అందులో ఉగ్రవాదం ముందుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు సభ్యదేశాలు సమష్టిగా పోరాడాలని ఆమె ఉద్ఘాటించారు. ‘ప్రాథమిక, మానవ హక్కులకు ఉగ్రవాదం శత్రువుగా పరిణమించింది. శాంతి, శ్రేయస్సు, జీవనానికి పెనుసవాల్‌గా మారింది’ అని ఆమె అన్నారు. ప్రపంచానే్న అస్థిరపరచాలన్న ఉగ్ర కుట్రలను భగ్నం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్న ముష్కరులను వదిలిపెట్టొదని, అలాగే వారికి ఊతమిస్తున్న వారికీ సరైన గుణపాఠం చెప్పాలని ఆమె అన్నారు. ‘మనమందరం అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్రంగా చర్చించి ఇక్కడే ఓ నిర్ణయం తీసుకుందాం’ అని సుష్మా స్వరాజ్ విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి రెండు దశాబ్దాల క్రితమే ఐరాసలో భారత్ చేసిన ప్రతిపాదనలను ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. అలాగే రక్షణ వాదాన్ని తిరస్కరించుకుని, ఆర్థిక ప్రపంచీకరణ విస్తరించాలని భారత్ ఆకాంక్షించింది. వాణిజ్యాన్ని ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోయేలా షాంఘై సదస్సులో ఓ నిర్ణయం తీసుకోవాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పిలుపునిచ్చారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ఈ, కజఖిస్తాన్ విదేశాంగ మంత్రి కైరత్ అబ్దర్‌ఖమనొ, ఖైర్‌గైస్తాన్ విదేశాంగ మంత్రి అబల్‌డవె ఎర్లాన్ బెకెషోవిచ్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్‌రొవ్, తజికిస్తాన్ విదేశాంగ మంత్రి సిరోజిదిన్ అస్లో, ఉజ్‌బెకిస్తాన్ విదేశాంగ మంత్రి అబ్దులజీజ్ ఖఫిజోవిచ్, ఎస్‌సీఓ ప్రధాన కార్యదర్శి రషీద్ అలిమొవ్ ఈ సదస్సుకు హాజరయ్యారు.

చిత్రం..షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకు వచ్చిన వివిధ దేశాల విదేశాంగ మంత్రులతో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్