అంతర్జాతీయం

కలిసి నడుద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉలాన్‌బాతర్, ఏప్రిల్ 25: ద్వైపాక్షిక వాణి జ్యం, ఆర్థిక సహకారం అందించుకోవాలని భారత్-మంగోలియా నిర్ణయించాయి. వౌలిక వసతుల అభివృద్ధి, ఇంధనం, సేవల రంగం, ఐటీ అలాగే ఇరుదేశాల మధ్య నేరుగా విమాన సౌకర్యం వంటి అంశాలపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, మంగోలియా విదేశాంగ మం త్రి డీ తోగ్గాబాతర్ చర్చించారు. ఇండో-మంగోలియా సంయుక్త, సహకారంపై జరిగిన 6వ సమావేశంలో ఇరుదేశాలకు ప్రయోజనం చేకూర్చే పలు అంశాలపై అంగీకారం కుదింది. ఈ సందర్భంగా ఇరుదేశాల విదేశాంగ మం త్రుల సంయుక్త మీడియా సమావేశంలో మా ట్లాడుతూ అనేక అంశాలపై పరస్పర సహకారంతో ముందుకుసాగాలని నిర్ణయించుకున్న ట్టు వెల్లడించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం, పెట్టుబడులపై తాము చర్చించిన ట్టు మంత్రులు తెలిపారు. వనరులతో అలరారుతున్న మంగోలియాను సందర్శించిన తొలి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. తూ ర్పు ఆసియాలోనే సుస్థిర దేశం మంగోలియా అని సుష్మా ప్రశంసించారు. సమాజిక, ఆర్థిక అభివృద్ధి దేశంలో శాంతి, సమాజ శ్రేయస్సుకు దోహదపడుతున్నాయని ఆమె అన్నారు. ప్ర పంచానికి పెను సవాల్‌గా మారిన ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుచేయాలని భారత్-మం గోలియా నిర్ణయించాయి. అలాగే పలు ప్రాజెక్టుల స్థాపనకు పరస్పరం సహకరించుకోవాలని ఓ అంగీకారానికి వచ్చాయి. రిఫైనరీ రం గంలో మంగోలియాకు కావల్సిన శాస్త్ర, సాంకేతిక సహకారాన్ని అందిస్తామని భారత్ ప్రకటించింది. అలాగే వాణిజ్యం, ఆర్థిక, పెట్డుబడుల రంగంలోనూ పరస్పర సహకారంతో స హాయ, సహకారాలు అందిపుచ్చుకోవాలని నిర్ణయించారు. ప్రపంచంలో అత్యంత వేగం గా అభివృద్ధి చెందుతున్న భారత్, మంగోలియాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉం దని సుష్మాస్వరాజ్ ప్రకటించారు. అలాగే మంగోలియా తమకు వ్యూహాత్మక భాగస్వామి అన్నారు. చారిత్రకంగానూ మంగోలియాతో అనుబంధం పెనవేసుకుని ఉందని విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. అలాగే మంగోలియా ప్రధాని యూ ఖురెల్‌సుఖ్‌తో సుష్మా భేటీ అ య్యారు. భారత్‌లో తమకు ఆరు దశాబ్దాల మై త్రి ఉందని మంగోలియా పేర్కొంది.

చిత్రం..మంగోలియా విదేశాంగ మంత్రి డీ తోగ్గాబాతర్‌తో
భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్