అంతర్జాతీయం

ఐరాసా వద్ద నిధుల్లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, ఏప్రిల్ 25: ఐక్యరాజ్య సమితి (ఐరాస) శాంతి పరిరక్షణ కార్యకలాపాలకు నిధుల కొర త పెద్ద ఆటంకంగా మారిందని భారత్ పేర్కొంది. ఐరాస ప్రపంచ వ్యాప్తంగా చేపట్టే శాంతి పరిరక్షణ చర్యలకు అవసరమైన నిధుల్లో కనీసం ఒక్కశాతం కూడా కేటాయించలేని దుస్థితి నెలకొని ఉన్నదని భారత్ ఆవేదన వ్యక్తం చేసింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి గితేశ్ శర్మ మాట్లాడుతూ సవాళ్లు, అవకాశాలపై సమగ్ర అవగాహన ఉన్నప్పుడు మాత్రమే సుస్థిర శాంతి సాధ్యమవుతుందన్నారు. శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలంటే అంతర్జాతీయంగా మరింత నిబద్ధత, దీర్ఘకాలిక రాజకీయ ప్రక్రియ అవసరమని పేర్కొన్నారు. ‘వివిధ దేశాల మధ్య చోటుచేసుకునే సంఘర్షణలను అరికట్టడంలో ఐరాస శాంతి పరిరక్షణ ప్రక్రియ చాలా సందర్భాల్లో విజయం సాధించినా, వివిధ దేశాల అంతర్గత సంఘర్షణల విషయంలో మాత్రం ఐరాస కొన్ని పరిమితులను ఎదుర్కొనాల్సి వచ్చింది’ అన్నారు.
ప్రస్తుతం శాంతి పరిరక్షణ కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన నిధుల్లో ఒక్కశాతం నిధులు కూడా ఐరాస వద్దలేవని పేర్కొంటూ, ఈ నిధుల కొరతను అధిగమించడానికి అవసరమైన ఆర్థిక సహాయం చేసే అవకాశాలపై ఆయా దేశాలు నిబద్ధతతో చర్చించాల్సిన అవసరం ఉన్నదని గీతేశ్ శర్మ స్పష్టం చేశారు. ఇక ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షణ కార్యకలాపాల్లో భారత్ అందించిన సేవల గురించి ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2007లో లైబీరియాలో ఏర్పాటైన ఐక్యరాజ్యసమి తి మిషన్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారి పూర్తిగా మహిళలతో కూడిన పోలీస్ యూనిట్‌ను ఏర్పాటు చేసిన ఘనత భారత్‌దేనన్నారు. అంతేకాదు సుస్థిరాభివృద్ధి ల క్ష్యాలు, వాతావరణ పరిరక్షణకు సంబంధించిన లక్ష్యాలను సాధించడంలో భారత్ కృషిచేసిందని గుర్తు చేశా రు. ఐరాసా ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెర్రెస్, జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు మిరోస్లావ్ లాజ్‌కాక్‌లు కూ డా శాంతి పరిరక్షణ కార్యకలాపాలకు తీవ్ర నిధుల సమ స్య ఉన్నదని అంగీకరించారు. సంఘర్షణల నివారణకు అంతర్జాతీయ సమాజం పెద్దగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాకపోవడంమే ఇందుకు కారణమన్నారు.