అంతర్జాతీయం

మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఏప్రిల్ 25: ‘మీడియా స్వేచ్ఛ’కు సంబంధించి భారత్ మరో రెండు ర్యాంకులు దిగజారింది. దేశంలో ఇటీవల చోటుచేసుకున్న కొన్ని సంఘటనలే ఈ పరిస్థితికి కారణమని ఓ సర్వే కథనం స్పష్టం చేస్తోంది. రిపోర్టర్లపై ‘్భతిక హింస’కు పాల్పడిన ఘటనల కారణంగా పత్రికా స్వేచ్ఛ జాబితాలో రెండుస్థానాలు దిగజారి 138వ స్థానంలో భారత్ నిలిచిందని ఆ సర్వే కథనంలో పేర్కొనడం గమనార్హం. రెం డు ర్యాంకులు దిగజారడానికి ప్రధాన కారణం జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య ఒకటైతే, మరికొన్ని ఘటనలను ఆ కథనంలో ప్రస్తావించారు. మీడియా స్వేచ్ఛ ఇండెక్స్‌లో గతేడాది టాప్‌లో వున్న నార్వే, ఈఏడాది సైతం అదే స్థానాన్ని నిలబెట్టుకుం ది. అదే సమయంలో మీడియా అణచివేతకు గురవుతున్న దేశాల జాబితాలో ఉత్తర కొరియా తరువాతి స్థానాల్లో ఎర్టిరి యా, తుర్కెమెనిస్తాన్, సిరియా, చైనాలు ఉన్నట్టు రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్‌ఎస్‌ఎఫ్) వెల్లడించింది. పత్రికా స్వేచ్ఛకు సంబంధించి 180 దేశాలకు ర్యాంకులిచ్చిన ఆర్‌ఎస్‌ఎఫ్ జా బితాలో గతేడాది పరిస్థితి నుంచి రెండు ర్యాంకులు కిందకు దిగజారిన భారత్, 138వ స్థానంలో నిలిచింది. 2014లో ప్ర ధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ హిందూ చాందసవాదులు మీడియాపై తీవ్ర వైఖరి ప్రదర్శిస్తున్నట్టు ఆర్‌ఎస్‌ఎఫ్ తన సర్వే కథనంలో పేర్కొనడం గమనార్హం. ‘అధికార పక్షానికి సంబంధించి ఏదైనా ఇన్విస్టిగేటివ్ రిపోర్టింగ్ లేక హిందూత్వపై విమర్శలు గుప్పించే వార్తలు ప్రచురితమైతే సంబంధిత రిపోర్టర్‌కు తీవ్ర హెచ్చరికలు చేయడం, బెదిరింపులకు పాల్పడటంలాంటి ఘటనలు దేశంలో చోటుచేసుకుంటున్నాయి. అదీ ప్రధానం గా ప్రధాని మోదీని అనుసరిస్తున్న ప్రయివేట్ ఆర్మీ నుంచి’ అంటూ ఆర్‌ఎస్‌ఎఫ్ తన కథనంలో పేర్కొనడం గమనార్హం. హిందూ సుప్రిమసీ, కుల విధానం, మహిళల పట్ల వివక్షను ప్రశ్నిస్తూ పాలకపక్షానికి వ్యతిరేకంగా గొంతువిప్పిన ఎడిటర్ గౌరీ లంకేశ్ హత్యకు గురైన అంశాన్ని ఆర్‌ఎస్‌ఎఫ్ తన కథనంలో ప్రత్యేకంగా ప్ర స్తావించింది. రిపోర్టర్లపై ఇలాంటి భౌతిక హింసాత్మక ఘటనల కారణంగానే మీడియా స్వేచ్ఛ విషయంలో భారత్ తన ప్రతిష్టను దిగజార్చుకుంటోందని ఆ కథనంలో పేర్కొన్నారు.