అంతర్జాతీయం

నేనన్నది నిజమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: పర్యవసానాలు ఎలావున్నా తాను నిజం మాట్లాడి తీరుతానని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. 26/11 దాడుల వెనుక పాక్ హస్తం ఉందంటూ తాను చేసిన వ్యాఖ్యలను గట్టిగా సమర్థించుకున్న షరీఫ్, తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ముంబయి పేలుళ్ల వెనుక పాక్ హస్తం ఉందంటూ బాహాటంగానే ఓ ఇంటర్వ్యూలో షరీఫ్ వెల్లడించిన నేపథ్యంలో పాక్‌లో హాహాకారాలు చెలరేగాయి. ఆయన ప్రకటనలను తిరస్కరిస్తూ పాక్ జాతీయ భద్రతా కమిటీ ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించింది. గతంలో నవాజ్ షరీఫ్ పార్టీ అవలంభించిన వైఖరికి తాజాగా ఆయన మాటలకు మధ్య పొంతన లేకపోవడంతో వివాదం చెలరేగింది. ‘ఆ ఇంటర్వ్యూలో నేను చెప్పిన దాంట్లో తప్పేముంది?’ అని నవాజ్ షరీఫ్ అన్నారు. అవినీతి కేసులో విచారణకు హాజరైన ఆయన ఇస్లామాబాద్‌లోని ఓ న్యాయస్థానం వెలుపల మీడియాతో మాట్లాడారు. శనివారం ఎప్పుడైతే షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారో, ఆయన సారథ్యంలోని పార్టీ వివరణ ఇచ్చింది. షరీఫ్ అన్నది ఒకటైతే, భారత మీడియా ప్రచురించింది మరొకటని పేర్కొంది. అయితే షరీఫ్ మాత్రం తాను అన్నమాటకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేయడంతోపాటు, పర్యవసానాలతో నిమిత్తం లేకుండా నిజాలనే చెబుతానని పునరుద్ఘాటించారు. ముంబయి పేలుళ్ల వెనుక పాక్ హస్తం ఉందన్నది తాను కొత్తగా బయటపెట్టిన విషయమేమీ కాదని, గతంలో మాజీ అధ్యక్షుడు పర్వేష్ ముషారఫ్, మాజీ హోంమంత్రి రెహ్మాన్ మాలిక్, మాజీ జాతీయ భద్రతా సలహాదారు మహమూద్ దురానీ సైతం ఈవిధమైన ప్రకటన చేశారన్నారు.
ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారిని దేశ ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం మొదలైందని షరీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ 50వేల మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని, అయినప్పటికీ ప్రపంచ దేశాలు తమ వాదనను ఎందుకు వినడం లేదని ఆయన ప్రశ్నించారు. పైగా ఇలాంటి ప్రశ్నలు వేస్తున్న వ్యక్తిని దేశ ద్రోహిగా ముద్ర వేస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. తనపై విమర్శలు గుప్పిస్తున్న స్థానిక మీడియాపై కూడా ఆయన నిప్పులు చెరిగారు. కావాలనే తనపై ఈ రకమైన ప్రచారం జరుగుతోందని పేర్కొన్న షరీఫ్, ‘దేశాన్ని, దేశ రాజ్యాంగాన్ని తునాతునకలు చేసిన వ్యక్తులు దేశ భక్తులా?’ అంటూ ఎదురు దాడికి దిగారు. అలాగే న్యాయస్థానాల నుంచి న్యాయమూర్తులనే తొలగించిన వ్యక్తి దేశ భక్తుడా? అని కూడా పరోక్షంగా ముషారఫ్‌పై విరుచుకుపడ్డారు. ఎవరేమనుకున్నా, ఎవరి మనసు నొచ్చుకున్నా ఫలితాలు, పర్యవసానాలు ఏవిధంగా పరిణమించినా కూడా వాస్తవాలను చెప్పడంలో తననెవరూ నిరోధించలేరన్నారు. పాక్‌లో రాజ్యేతర శక్తులు క్రియాశీలకంగా ఉన్నాయంటూ చేసిన వ్యాఖ్యలను ధ్రువీకరిస్తారా? అన్న ప్రశ్నకు షరీఫ్ కుమార్తె మేరియాం జవాబిచ్చారు. దేశంలో రాజ్యేతర శక్తులు క్రియాశీలకంగా లేనపుడు సైనిక దాడులు జరపాల్సిన అవసరం ఏమిటి? మరి ఆ దాడులను ఎవరికి వ్యతిరేకంగా జరిపినట్టు? అని ఆమె ప్రశ్నించారు.