అంతర్జాతీయం

కోర్టుకీడ్చినా భయపడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెరూసలేం, మే 15: గాజా సరిహద్దులో జరిగిన హింసాకాండపై ఇజ్రాయెల్ ప్రభుత్వం స్పందించింది. టెల్‌అవీవ్ నుంచి అమెరికా ఎంబసీని జెరూసలేంకు తరలించడాన్ని నిరసిస్తూ పాలస్తీనియన్లు చేపట్టిన ఆందోళన హింస్మాతంగా మారింది. సమారు 59 మంది గాజా హింసలో మరణించారు. తమ భద్రతాదళాల చర్యను సమర్థించుకున్న ఇజ్రాయెల్ ప్రభుత్వం ‘ఇందులో చట్ట ఉల్లంఘన ఏమీ లేదు’అని ప్రకటించింది. అలాగే హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని పాలస్తీనా ప్రభుత్వం ఆశ్రయించే అవకాశం ఉందన్న వార్తలపై ఇజ్రాయెల్ న్యాయశాఖ మంత్రి అయెలెట్ షాకెడ్ మాట్లాడుతూ ‘కోర్టుకు వెళ్లినా భయపడం’అని స్పష్టం చేశారు. ఆందోళనలు శ్రుతిమించడంతోనే భద్రతాదళాలు జోక్యం చేసుకోవల్సి వచ్చిందని ఆమె వివరించారు. సోమవారం నాటి గాజా ఊచకోతను పాలస్తీనా సహా పలుదేశాలు తీవ్రంగా ఖండించాయి.‘ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్) సరైనరీతిలోనే స్పందించాయి. ఎక్కడా ఉల్లంఘనలు జరగలేదు. అంతర్జాతీయ చట్టాల పరిధిలోనే మా దళాలు కాల్పులు జరిపాయి’అని మంత్రి అన్నారు. తమ దళాలు చక్కగా తమ బాధ్యతలను నిర్వర్తించాయని ఆమె కితాబు ఇచ్చారు. ‘హమాస్ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను బలిపశువులను చేస్తున్నారు. మా దళాలు మాత్రం పరిస్థితిని చక్కదిద్దడం కోసమే పాటుపడుతున్నాయి’అని తెలిపారు. సోమవారం నాడు గాజా సరిహద్దుల్లో ఐడీఎఫ్ అలా స్పందించకపోతే పరిస్థితి అదుపులోనికి వచ్చి ఉండేది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. అలా గే ఇజ్రాయెల్‌లోని పలు రాజకీయ పార్టీలు, నేతలు, ప్రజాప్రతినిధులు సైనిక చర్యను సమర్ధించారు.

చిత్రం..పాలస్తీనీయులపై కాల్పులకు నిరసనగా ఇస్తాంబుల్‌లో నిర్వహించిన భారీ ర్యాలీ