జాతీయ వార్తలు

సీఐఏ డైరెక్టర్‌గా జినా హాస్పెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 18: అమెరికా దేశ ప్రధాన గూఢచార వ్యవస్థ అయిన సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ (సిఐఏ)కు మొట్టమొదటిసారిగా ఒక మహిళను డైరెక్టర్‌గా నియమించారు. 70 ఏళ్ల సిఐఏ చరిత్రలో ఒక మహిళను నియమించడం ఇదే ప్రథమం. యుఎస్ సెనెట్‌లో గురువారం జరిగిన ఓటింగ్‌లో 54-45తో జినాహాస్పెల్ (61) నియామకానికి మద్దతు లభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్ నామినేట్ చేసిన జినాహాస్పెల్‌కు ఆరుగురు డెమాక్రటిక్ పార్టీ సెనేటర్లు సైతం మద్దతు తెలిపారు. ‘కొత్తగా నియమితులైన సిఐఏ డైరెక్టర్ జినా హాస్పెల్‌కు అభినందనలు’ అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.
కాగా, ఈమె నియామకాన్ని విపక్ష, కొన్ని మానవహక్కుల సంఘాలు వ్యతిరేకించాయి. 9/11 ఉగ్రవాదుల దాడి అనంతరం నిందితులను విచారించిన పద్ధతులపై అప్పట్లో ఆమెపై పలు విమర్శలు వచ్చాయి. 30 ఏళ్లపాటు సిఐఏలో సేవలందించిన ఆమె త్వరలోనే దానికి డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈమె ఇప్పటికే ఆఫ్రికా, యూరప్, ఇతర ప్రాంత్లా సేవలందించి గత సంవత్సరమే డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ట్రంప్ ఆమెను స్టేట్ సెక్రటరీగా నియమించే వరకుసిఐఏ డైరెక్టర్ మైక్ పాంపియో నేతృత్వంలోనే పనిచేశారు. అయితే ఆమె నేతృత్వంలో సిఐఏ 9/11 దాడుల అనంతరం చేపట్టిన విచారణ పద్ధతులు తిరిగి చేపట్టరన్న విశ్వాసాన్ని మానవహక్కుల సంఘం ప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు.