అంతర్జాతీయం

చర్చలకు రాకపోతే గడాఫీ గతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 18: అణ్వస్తన్రిరోధంపై చర్చల విషయంలో ఉత్తరకొరియా తన మనసు మార్చుకోవడానికి ప్రధాన కారణం చైనా అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఉత్తరకొరియా తన వైఖరిని మార్చుకోకపోతే, తాము ముందస్తు ప్రణాళిక ప్రకారం తర్వాతి చర్యలకు ఉపక్రమించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిజానికి వచ్చే జూన్ 12న సింగపూర్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోన్ ఉన్‌ల మధ్య చర్చలు జరగాల్సి ఉంది. ఈ చర్చలపై సానుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన కిమ్ జోన్ ఒక్కసారిగా మాట మార్చి ‘అమెరికా ఏకపక్షంగా అణ్వస్త్రాలను వదిలేయాలని డిమాండ్ చేస్తున్నందంటూ’ ఆరోపించి చర్చల్లో పాల్గొనబోమని బెదిరించడంతో చర్చల కథ అడ్డం తిరిగింది.
ఈ నేపథ్యంలో ట్రంప్ తన ఓవెల్ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ, ‘చర్చలు జరిగితే జరుగుతాయి. ఒకవేళ జరగకపోతే మేం తర్వాతి చర్యలు మొదలుపెడతాం’ అని స్పష్టం చేశారు. ఒకవేళ అణ్వస్త్రాలను వదిలేస్తే, కిమ్ పదవిలో కొనసాగడానికి తమకు ఎటువంటి అభ్యంతరం ఉండదని, లేని పక్షంలో లిబియా అధ్యక్షుడు కల్నల్ గడాఫీ తిరుగుబాటుదారుల చేతిలో మరణించిన దుర్గతే పడుతుందని ట్రంప్ హెచ్చరించారు.
ఒక్కసారిగా పరిస్థితిలో ఇంతటి మార్పు రావడానికి కారణమేంటని విలేకర్లు ప్రశ్నించగా, ‘కిమ్ చైనా సందర్శించిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తెరవెనుక ఉండి కిమ్‌ను నడిపిస్తున్నారు’ అన్నారు. లిబియా పట్ల వ్యవహరించిన మాదిరిగా తమ దేశంతో ట్రంప్ వ్యవహరిస్తున్నారంటూ ఉత్తరకొరియా చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ, ‘లిబియా పరిస్థితి పూర్తి భిన్నం. అసలు గడాఫీతో ఏవిధమైన ఒప్పందం లేదు. కానీ ఉత్తర కొరియాతో మేం ఆవిధంగా వ్యవహరించాలనుకోవడం లేదు’ అని స్పష్టం చేశారు.