అంతర్జాతీయం

నిఫా వైరస్‌తో మరొకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోజిక్కోడ్, మే 24: నిఫా వైరస్ బారిన పడిన మరో వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించడంతో, ఇప్పటి వరకు ఈ వ్యాధికి బలైనవారి సంఖ్య 11కు చేరింది. వి.మూసా (61) అనే వద్ధుడు కొద్ది రోజులుగా ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించి గురువారం ఉదయం మరణించాడని, జిల్లా వైద్యాధికారణి డాక్టర్. జయశ్రీ విలేకర్లకు తెలిపారు. మూసా మరణంతో ఆ కుటుంబంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఇదిలావుండగా 160 నమూనాలను వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు పంపగా, 13 కేసులకు నిఫావైరస్ నిర్ధారణ అయినట్లు ఆమె వెల్లడించారు. కాగా నిఫా వైరస్ బారిన పడిన మూసా కుటుంబ సభ్యులకు లినీ పుతుస్సెరీ మొదట్లో చికిత్స అందించింది. చివరకు ఈ వైరస్ బారినపడి ఆమె కూడా మరణించింది. ఇదిలావుండగా కోజిక్కోడ్, మలప్పురం, వాయనాడ్, కన్నూర్ జిల్లాలకు పర్యాటకులు వెళ్లకుండా ఉండటమే మంచిదని కేరళ ప్రభుత్వం సలహా ఇచ్చింది. నిఫా సమస్యపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, శుక్రవారం కోజిక్కోడ్‌లో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు సంభవించిన మరణాలు, కేవలం కోజిక్కోడ్, మలప్పురం జిల్లాలోనే చోటుచేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం 18 మంది ‘నిఫా’ రోగులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 11 మంది ఇప్పటికే మరణించారు. కోజిక్కోడ్ జిల్లాలోని ఛంగరోథ్, కూరఛుండ్, కొత్తూర్, ఛెరువన్నూర్, ఛెక్యాడ్, ఛక్కిత్తపర, ఒలవన్న ప్రాంతాల్లో నిర్వహించే సమ్మర్ క్యాంపులు, శిక్షణా శిబిరాలను రద్దు చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. అయితే వేసవి సెలవుల తర్వాత పాఠశాలల పునఃప్రారంభానికి సంబంధించి ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు.

చిత్రం..నిఫా వైరస్ సోకి మరణించిన మూసాకు మాస్కులు ధరించి అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఆసుపత్రి సిబ్బంది