అంతర్జాతీయం

క్యురియాసిటీ రోవర్‌తో అద్భుత ఫలితాలు : నాసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 24: అంగారక గ్రహంపై నాసా చేస్తున్న పరిశోధనల్లో కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఏడాది క్రితం నాసా ప్రయోగించిన క్యురియాసిటీ మార్స్ రోవర్ విజయవంతంగా మట్టి శాంపిల్స్‌ను సేకరించాయి. అంగారక గ్రహం పైన ఉన్న శిలలను తవ్వి పౌడర్‌ను సేకరించినట్లు నాసా పేర్కొంది. గ్రహంపైన ఉన్న దులుత్ అనే శిలను లక్ష్యంగా చేసుకుని రెండు ఇంచు ల మేరకు రోవర్ తవ్వినట్లు నాసా పేర్కొంది. క్యురియాసిటీ మా ర్స్ రోవర్‌ను ప్రయోగించిన తర్వాత 2016 డిసెంబర్‌లో కొన్ని సాంకేతిక అవరోధాలు తలెత్తాయి. ఆ తర్వాత కొత్త డ్రిల్లిం గ్ విధానాన్ని శాస్తవ్రేత్తలు రోవర్‌కు అమర్చారు. దీనికి ఫీడ్ ఎక్సెండెండ్ డ్రిల్లింగ్ అని నామకరణం చేశారు. మనం ఇంట్లో గోడకు మేకు పెట్టి కొట్టిన విధంగా రోవర్ కూడా రోబోటిక్ విధానంలో ద్వారా శిలల్లోకి చొచ్చుకుపోయి శాంపిల్స్‌ను వెలికి తీసినట్లు క్యు రియాసిటీ డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ స్టీవ్ లీ తెలిపారు. భూ మి నుంచి 60 మిలియన్ మైళ్ల దూరంలో ఉన్న అంగారక గ్ర హం లో తాము ప్రయోగించిన క్యురియాసిటీ రోవర్ యాంత్రిక విధానంలో అద్భుతమైన ఫలితాలు సాధించిందన్నారు. రోవర్‌లో రెం డు ప్రయోగశాలలను అమర్చారు. ఇవి రసాయనిక, ఖనిజ విశే్లషణ చేస్తాతయి. క్యురియాసిటీ డ్రిల్లింగ్ విధానం అంతరిక్ష పరిశోధన రంగంలో కొత్తరికార్డులను నెలకొల్పినట్లు చెప్పారు. తా ము ఆశించిన లక్ష్యాలు పూర్తయినట్లు భావించమని, ఇది నిరంతర ప్రక్రియ అని సిస్టమ్స్ ఇంజినీర్ టామ్ గ్రీన్ తెలిపారు.