అంతర్జాతీయం

ఇప్పుడే వెళ్లిపోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 25: యూరోపియన్ యూనియన్‌నుంచి వైదొలగాలని బ్రిటన్‌వాసులు రెఫరెండంలో ఓటువేయడంపైన ఇయు సైతం గుర్రుగా ఉంది. వీలయినంత త్వరగా యూరోపియన్ యూనియన్‌నుంచి తప్పుకుంటే మాకు కూడా మంచిదంటూ యూరోపియన్ కమిషన్ చ్మైన్ జీన్ క్లాడె జంకర్ వ్యాఖ్యానించారు. యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయానికి విడాకుల లేఖ పంపడానికి బ్రిటన్ ప్రభుత్వానికి అక్టోబర్ వరకు సమయం ఎందుకు అవసరమో నాకు అర్థంకావడం లేదు. ఆ పనేదో వెంటనే చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం అని జంకర్ జర్మన్ రేడియో ఎఆర్‌డితో మాట్లాడుతూ అన్నారు. అంతేకాదు బ్రిటన్-ఇయు సంబంధాలపై ఆయన వ్యాఖ్యానిస్తూ, ‘ఇది సామరస్యంగా జరిగిన విడాకులు కాదు, అలాగని సన్నిహితంగా ఉండిన లవ్ అఫైర్ కూడాకాదు’ అని అన్నారు.