అంతర్జాతీయం

సింగపూర్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, జూన్ 27: సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. అందులో ప్రయాణిస్తున్న 240మంది సురక్షితంగా బయటపడ్డారు. చాంగి విమానాశ్రయం నుంచి మిలన్‌కు సోమవారం తెల్లవారుజామున రెండు గంటలకు బయలుదేరిన సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం రెండు గంటలపాటు ప్రయాణించిన తరువాత సాంకేతిక లోపాన్ని ఎదుర్కొంది. ఇంజన్ ఆయిల్ వార్నింగ్ సందేశం రావటంతో విమానాన్ని వెంటనే చాంగి విమానాశ్రయానికి మళ్లిస్తున్నట్లు పైలట్ ప్రకటించారు. చాంగి రన్‌వేపై దిగిన వెంటనే విమానం కుడి ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. విమానాశ్రయంలో అత్యవసర సిబ్బంది వెంటనే మంటలను ఆపేయటంతో పెద్ద ప్రమాదం తప్పింది. విమానంలోని 222మంది ప్రయాణికులు, 19మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులందరినీ టెర్మినల్ బిల్డింగ్‌కు బస్సులో తరలించారు.