అంతర్జాతీయం

బడాయి మాటలతో సమస్య పెరుగుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 27: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ (ఇయు) నుంచి బ్రిటన్ వైదొలగడం (బ్రెగ్జిట్)పై చేసిన వ్యాఖ్యలను డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తీవ్రంగా ఖండించారు. అలాంటి సమయాలలో ఇలాంటి బడాయి మాటలు మంచికన్నా చెడు ఎక్కువ చేస్తాయని ఆమె పేర్కొన్నారు. ట్రంప్ శుక్రవారం స్కాట్లాండ్ పర్యటనలో విలేఖరులతో మాట్లాడుతూ ఇయు నుంచి బ్రిటన్ వైదొలగాలని రెఫరెండంలో ఆ దేశ ప్రజలు తీర్పునివ్వడం అద్భుతమని వ్యాఖ్యానించారు. అమెరికాలోని మేయర్ల సదస్సులో హిల్లరీ మాట్లాడుతూ తమ వాణిజ్య ప్రయోజనాల కన్నా అమెరికా ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చేవారే అమెరికాను పాలించాలని పరోక్షంగా ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. అయితే ఆమె ట్రంప్ పేరును ప్రస్తావించకుండా, అతను ‘బ్రెగ్జిట్’ ఓ గొప్ప విషయం అనుకుంటున్నాడు అని వ్యాఖ్యానించారు. ఆధునీకరించిన ట్రంప్ టర్న్‌బెర్రీ గోల్ఫ్ కోర్స్‌ను పునఃప్రారంభించేందుకు ట్రంప్ శుక్రవారం స్కాట్లాండ్‌కు వెళ్లారు.