అంతర్జాతీయం

భారత్‌లో పితృత్వ సెలవులు లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాస, జూన్ 14: పురుషులకు పితృత్వ సెలవలు మంజూరు చేయని 90 దేశాల్లో భారత్ కూడా ఒకటి అంటూ యునిసెఫ్ పేర్కొంది. అందుకు అవసరమైన జాతీయ విధానాలు భారత్‌లో అమల్లో లేకపోవడం విచిత్రమని వ్యాఖ్యానించింది. ప్రపంచంలో దాదాపు 2/3 వంతుల మంది అంటే 90 మిలియన్ల మంది ఏడాది లోపు చిన్నారులే. కానీ ఒక్క రోజు కూడా పురుషులకు చెల్లింపుతో కూడిన పితృత్వపు సెలవులు ఇవ్వడం లేదని యునిసెఫ్ విశే్లషించింది. మొత్తం 92 దేశాల్లో అత్యధికంగా ఏడాదిలోపు శిశువులు ఉన్నది భారత్, నైజీరియా దేశాల్లో మాత్రమే. కానీ శిశువుల సంరక్షణ కోసం పితృత్వ సెలవులు ఇచ్చే జాతీయ విధానాన్ని ఈ దేశాలు ఇప్పటికీ అమలు పరచకపోవడం విచారకరమని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా దేశాల్లో ‘కుటుంబానికి అనుకూల’ విధానాలు అమలు జరపడం క్రమంగా పెరుగుతూ వస్తోందని వివరించింది. మూడు నెలల పితృత్వసెలవుల మంజూరుకు వీలు కల్పించే ‘పాటర్నిటీ బెనిఫిట్ బిల్లు’ను వచ్చే జూలైలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు భారత అధికార్లు ప్రతిపాదించడం ఇందుకు ఉదాహరణగా పేర్కొంది. అమెరికాతో సహా ఎనిమిది దేశాల్లో ఇప్పటికీ ప్రసూతి, పితృత్వ సెలవులు అమల్లో లేవంటూ యునిసెఫ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అయితే బ్రెజిల్, కాంగో దేశాల్లో పితృత్వ సెలవులను అమలు పరుస్తున్నారన్న సంగతిని గుర్తు చేసింది.
తల్లిదండ్రులతో చిన్నప్పటినుంచే పిల్లలు సానుకూల, అర్థవంతమైన రీతిలో సన్నిహితంగా మెలగడం వల్ల వారిలో మెదడు మరింత వేగంగా వృద్ధి చెందుతుందని వివరించింది. చిన్నతనం నుంచే తండ్రులు తమ పిల్లలతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవడం, వారి అభ్యున్నతికి దోహదం చేస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు జాతీయ స్థాయిలో ‘కుటుంబ అనుకూల విధానాలు’ అమలు పరచడం చాలా అవసరమని స్పష్టం చేసింది.