అంతర్జాతీయం

మానవ హక్కుల మండలిదే తుది నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాస, జూన్ 14: కశ్మీర్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకె)ల్లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నదన్న ఆరోపణలపై, అంతర్జాతీయంగా ఉన్నత స్థాయి స్వతంత్ర విచారణ జరపాలనేదానిపై మానవ హక్కుల చీఫ్ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో, తీసుకోవాల్సిన తదుపరి చర్యను యుఎన్ మానవ హక్కుల మండలి సభ్యులు నిర్ణయిస్తారని, ఐరాస ప్రతినిధి అంటానియో గుటెర్రిస్ తెలిపారు. కశ్మీర్, పీఓకేలపై తొలిసారిగా మానవ హక్కుల నివేదిక వెలువరించిన నేపథ్యంలో యుఎన్ ప్రధాన కార్యదర్శి డిప్యూటీ ప్రతినిధి ఫర్హన్ హక్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే ఈ నివేదికను భారత్ తిరస్కరించింది. అవాస్తవమైన, స్వంత అభిప్రాయంతోకూడిన, ప్రేరణాత్మక నివేదికగా పేర్కొంది. ఇందులో పేర్కొన్న అంశాలు అప్రాణికమైనవని, ఏవిధమైన ధ్రువీకరణ లేకుండా పేర్కొన్నవని విదేశాంగ శాఖ ఆక్షేపించింది. కేవలం పక్షపాతంతో, తప్పుడు వివరణలతో ఉన్నదని పేర్కొంది. కాగా ‘ఇది మానవహక్కుల మండలి సభ్య దేశాలకు సంబంధించిన సమస్య. హైకమిషనర్ జెయిద్ మానవహక్కుల మండలికి ప్రతిపాదించారు. ఏవిధమైన స్పందన వస్తుందో వేచిచూద్దాం’ అని ఫర్హాన్ హక్ గురువారం విలేకర్లతో అన్నారు. కశ్మీర్ సమస్యను రెండు దేశాలు ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలన్నది ప్రధాన కార్యదర్శి అభిమతం. ఈ నివేదికపై మండలి ఏంచేస్తుందో చూద్దామన్నారు.