అంతర్జాతీయం

‘రేడియో ముల్లా’ ఖతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 15: పాక్ తాలిబన్ ఉగ్రవాద మూకలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కరుడుగట్టిన ప్రపంచ ఉగ్రవాది, పాక్ తాలిబన్ చీఫ్ వౌలానా ఫజుల్లా అమెరికా భద్రతా బలగాల చేతిలో ఖతమయ్యాడు. ఆఫ్గనిస్తాన్ తూర్పు కునార్ ప్రాంతంలో యూఎస్ బలగాలు జరిపిన డ్రోన్ దాడిలో ఫజుల్లా మృతి చెందినట్టు ఆఫ్గాన్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు ధ్రువీకరించారు. ఫుజుల్లాను ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తించిన అమెరికా, అతని తలకు 5 మిలియన్ అమెరికా డాలర్ల వెలకట్టడం తెలిసిందే. గురువారం ఆఫ్గాన్- పాక్ సరిహద్దులోని కునార్ ప్రాంతంలో అమెరికా బలగాలు జరిపిన ఉగ్రవాద వ్యతిరేక దాడుల్లో వౌలానా ఫజుల్లా అంతమైనట్టు అమెరికా రక్షణ శాఖ లెఫ్టినెంట్ కల్నల్ మార్టిన్ ఓ ’డోనె్నల్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆఫ్గాన్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మహ్మద్ రాడ్మనిష్ సైతం ఫజుల్లా మృతిని ధ్రువీకరించారు. కరుడుగట్టిన ఉగ్రవాదులు సమావేశమయ్యారన్న విశ్వసనీయ సమాచారంతో డాంగం జిల్లాలోని నుర్ గుల్ కలే గ్రామంపై అమెరికా భద్రతా బలగాలు ఆకస్మిక దాడులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ దాడుల్లో ఫజుల్లా సహా తెహ్రీక్- ఈ- తాలిబాన్ (టిటిపి)కు చెందిన మరో నలుగురు కమాండర్లు సైతం మృతిచెందారు. తన వాక్చాతుర్యంతో ఉగ్రవాద ప్రేరేపిత సభలు నిర్వహిస్తూ రేడియో ముల్లా అలియాస్ వౌలానా రేడియోగా ప్రాచుర్యం పొందిన వౌలానా ఫజుల్లా మరో నలుగురు కీలక నేతలతో కలిసి ఇఫ్తార్ విందు చేసుకుంటున్నట్టు సమాచారం అందడంతో సుదూరంలోని యూఎస్ ఎయిర్‌క్రాఫ్ట్ బలగాలు డ్రోన్ దాడులకు దిగినట్టు సమాచారం. అయితే, ఈ దాడుల్లో తమ నాయకుడు మృతిచెందిన విషయాన్ని తాలిబన్ ఇంతవరకూ ధ్రువీకరించలేదు.
నిజానికి ఉగ్రదాడుల్లో వౌలానా ఫజుల్లాకు పెద్ద చరిత్రే ఉంది. 2013లో తాలిబన్ బృందానికి నాయకుడిగా నియమితుడైనప్పటి నుంచీ అమెరికా, పాక్‌లకు వ్యతిరేకంగా భయానక దాడులకు తెగబడిన చరిత్ర అతనిది. 2014 డిసెంబర్‌లో పెషావర్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌పై దాడులకు తెగబడి 151మందిని పొట్టనబెట్టుకున్న ఘటనలో ఫజుల్లా కీలక పాత్రధారి. ఆ సంఘటనలో 130మంది స్కూలు పిల్లలు మృతిచెందటం తెలిసిందే. విద్యకు సంబంధించి బాలికా హక్కులపై పోరాటం సలిపి గ్లోబల్ సింబల్‌గా మారిన మలాలా యూసఫ్‌జాయ్‌ని అంతమొందించాలని 2012లోనే ఫజుల్లా తాలిబన్‌కు ఆదేశాలు జారీ చేసినట్టు అమెరికా చెబుతోంది. ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ పూర్తయ్యే వరకూ ఎటువంటి దాడులు చేపట్టకూడదంటూ అటు ఆఫ్గాన్ తాలిబన్, ఇటు ఆఫ్గాన్ భద్రతా బలగాలు నిర్ణయించుకున్న సమయంలో అమెరికా భద్రతా బలగాల డ్రోన్ దాడులు సంచలనం రేకెత్తిస్తున్నాయి. నిజానికి 2014లోనే వౌలానా ఫజుల్లా మృతిచెందినట్టు వార్తలు వచ్చాయి. ఆ తరువాత అది తప్పుడు సమాచారం అని తేలింది. అంతకుముందు 2010లో కూడా మూలానా మృతి చెందినట్టు వచ్చిన కథనాలు ఆ తరువాతి కాలంలో తప్పుడు సమాచారంగా తేలడం గమనార్హం.