అంతర్జాతీయం

గ్రీన్‌కార్డు @ 150 ఏళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 16: అమెరికా గ్రీన్‌కార్డు కావాలంటే ఒక భారతీయుడు ఎనే్నళ్లు నిరీక్షించాలో తెలుసా ? కనీసం 150 ఏళ్లని వాషింగ్టన్‌కు చెందిన కాటో ఇనిస్టిట్యూట్ అంచనావేసి ప్రకటించింది. ఇటీవల అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్ గ్రీన్‌కార్డుకోసం పెండింగ్‌లోవున్న భారతీయుల దరఖాస్తుల వివరాలు విడుదల చేసింది. దాదాపు 632,219 మంది భారతీయ ఇమ్మిగ్రెంట్స్ గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో భార్యా, భర్తలు, వారి పిల్లలు కూడా ఉన్నారు. అసాధారణ ప్రతిభాశాలురుకు మాత్రం గ్రీన్‌కార్డు కావాలంటే కనీసం ఆరేళ్లు
పడుతుంది. వీరిని ఈబి-1 ఇమ్మిగ్రెంట్స్ కేటగిరీలో చేర్చారు. దాదాపు 34,824మంది భారతీయులు ఈబి-1 కేటగిరీలో ఉన్నారు. వీరి జీవిత భాగస్వాములు, పిల్లలు 48,754 మంది ఉన్నారు. వీరిని కలుపుకుంటే ఇబి-1 కేటగిరీ కింద 83,578 మంది భారతీయులు వస్తారు. ఈబి-3 కేటగిరీలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నవారు 17 ఏళ్లపాటు గ్రీన్ కార్డు కోసం వేచిచూడాలి. వీరి సంఖ్య ఈ ఏడాది ఏప్రిల్ 20నాటికి దాదాపు 54,892 ఉంది. వీరి భార్య, పిల్లలు 60,381 మందిని కలుపుకుంటే ఈ క్యాటగిరీలో మొత్తం 1,15,273 మంది ఉన్నారు. ఈబి-2 కేటగిరీ కింద అడ్వాన్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు 151 ఏళ్లపాటు గ్రీన్ కార్డు కోసం వేచిచూడాలి. చట్టాలు, నిబంధలు మారిస్తే తప్ప వీరికి గ్రీన్‌కార్డు త్వరగా వచ్చే అవకాశం లేనేలేదు. చట్టాలు మారని పక్షంలో వీరు అమెరికా వదలి వెళ్లక తప్పదని అంటున్నారు. ఈబి-2 కోటా కింద 2,16,684 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ కోటాలో వీరికి సంబంధించి 2,16,684 మంది భార్య, పిల్లలను కలుపుకుంటే వీరి సంఖ్య 4,33,368. 2017లో 22,602 మందికి లీగల్ పర్మినెంట్ రెసిడెన్సీ కార్డులను ఇచ్చారు. ఇందులో ఈబి-1 కేటగిరీలో 13,082 మందికి, ఈబి-2 కేటగిరీలో 2879 మందికి, ఈబి-3 కేటగిరీలో 6641 మందికి కార్డులు ఇచ్చారు.