అంతర్జాతీయం

చైనాలో తొలిసారిగా యోగా దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూన్ 16: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పాటించే దేశాల జాబితాలో చైనా చేరింది. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సివో) శనివారం యోగా కార్యక్రమాలను నిర్వహించింది. యోగాసనాల ఈవెంట్‌ను చైనా నిర్వహించడం ఇదే తొలిసారి. ఐక్యరాజ్యసమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా డే గా ప్రకటించి, 2014 నుంచి అమలు చేస్తోంది. చైనాలో యోగాభాస్యం చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చైనీయులు పెద్ద ఎత్తున యోగాభ్యాసం చేస్తున్నారు. శనివారం షాంఘైలో జరిగిన యోగా ఈవెంట్‌లో ఎస్‌సివో సెక్రటరీ జనరల్ రషీద్ ఆల్మీవ్, చైనాలో భారత్ రాయబారి గౌతమ్ బంబావాలే, అతని భార్య అనిత బంబావాలే హాజరయ్యారు. ఇంకా అనేక దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సెక్రటరీ జనరల్ రషీద్ ఆల్మీవ్ మాట్లాడుతూ, యోగా అంటే భారత్ గుర్తుకువస్తుందని, యోగా కార్యక్రమానికి దేశ, విదేశాలనుంచి ప్రతినిధులు హాజరు కావడం ఆనందంగా ఉందన్నారు. వివిధ దేశాలు, జాతులు, సంస్కృతులకు చెందిన 150 మంది హాజరు కావడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ప్రజలను సంఘటితం చేసేందుకు, ఆరోగ్యపు అలవాట్లను పెంచేందుకు యోగ ఉపయోగపడుతుందన్నారు. చైనాలో యోగా భారత్ ప్రతినిధి మోహన్ సింగ్ భండారీ యోగా కార్యక్రమాలను నిర్వహించారు.