అంతర్జాతీయం

ఆఫ్గనిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, జూన్ 16: ఆఫ్గనిస్తాన్‌లోని తూర్పు ప్రాంతంలో రంజాన్ పండగ సందర్భంగా ప్రార్ధనలు చేసేందుకు సమావేశమైన తాలిబన్ ఉగ్రవాదుల శిబిరం వద్ద జరిగిన ఆత్మహుతి దాడిలో 21 మంది మరణించారు. 41 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో, గాయపడిన వారిలో చాలా మంది తాలిబన్లు ఉన్నారని పోలీసు చీఫ్ గులాం సనారుూ స్టాంక్‌జీ తెలిపారు. ప్రార్ధనలు జరుగుతున్న సమయంలో తాలిబన్లు నిరాయుధులుగా ఉన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆఫ్గనిస్తాన్ అధ్యక్షుడు ఆష్రాఫ్ ఘని ప్రకటన చేస్తూ కాల్పుల విరమణను మరో 9 రోజులు పొడిగిస్తున్నట్లు తెలిపారు. రంజాన్ వరకు కాల్పుల విరమణ చేస్తున్నట్లు గతంలోనే ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. కాగా రంజాన్ సందర్భంగా మూడు రోజుల పాటు కాల్పులవిరమణ అమలు చేస్తామని తాలిబన్ నాయకుడు హైబతుల్ల అకున్‌జడ్ గురువారం ప్రకటించారు. తూర్పు ఆఫ్గనిస్తాన్‌లోని రోడట్ జిల్లాలో తూర్పు నాన్‌గర్హర్ ప్రాంతంలో ఆత్మాహతిదాడి జరిగింది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటనపై ఇంతవరకు అధికారికంగా ప్రకటన చేయలేదు. దీనికి బాధ్యులం తామేనంటూ ఏ సంస్ధ కూడా ప్రకటన చేయకపోవడం గమనార్హం. గతంలో ఈ ప్రాంతంలో ఐఎస్ అనే సంస్థ , తాలిబాన్లపై పోరాటం చేసింది. శనివారం రంజాన్ సందర్భంగా జరిగిన ఘటనతో ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్లపై ఆధిపత్యం సాధించేందుకు మరో ఉగ్రవాద సంస్థ చేసిన దాడిగా భావించవచ్చని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.