అంతర్జాతీయం

నైజీరియాలో ఆత్మాహుతి దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కానో (నైజీరియా), జూన్ 17: ఈశాన్య నైజీరియాలో జరిగిన జంట ఆత్మాహుతి దాడుల్లో కనీసం 31 మంది మృతి చెందారు. క్షతగాత్రుల సంఖ్య వందల సంఖ్యలో ఉంది. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని బొర్నో రాష్ట్రం దంబోవా నగరంలో భక్తులు ప్రార్థనలు ముగించుకొని ఇళ్లకు వెళుతున్నప్పుడు గుర్తుతెలియని వ్యక్తులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారని స్థానిక మీడియా తెలిపింది. బొకో హరమ్ జిహాదీ సంస్థకు చెందిన ఉగ్రవాదులే ఈ చర్యకు పాల్పడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. మొదట గ్రనేట్లు విసిరి, రాకెట్ లాంఛర్లతో బాంబులు వేసిన ఇద్దరు జిహాదీలు ఆతర్వాత జనంలోకి పరుగులుపెట్టి, తమనుతాము పేల్చేసుకున్నారు. ఈ సంఘటనలోకనీసం 31 మంది మృతి చెందారని అధికారులు అంటుంటున్నారు. అయితే, ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉందని ప్రత్యక్ష సాక్షులు స్పష్టం చేస్తున్నారు. ఈ సంఘటన బాధితుల్లో ఎక్కువ మంది బాలికలు, యువతులు ఉన్నారని చెప్తున్నారు.

చిత్రం..ఆత్మాహుతి దాడి జరిగిన ప్రాంతం