అంతర్జాతీయం

ఇక కోర్టుల్లేవ్.. కేసులు ఉండవ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 25: ‘దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని తక్షణమే గెంటేస్తాం. ఈ విషయంలో కోర్టుల్లేవ్.. కేసుల్లేవ్.. కేవలం చర్యలే. మా దేశంపైకి దండెత్తేవారిని ఉపేక్షించి ఊరుకోం ’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. వివిధ మార్గాల్లో, ప్రత్యేకించి హెచ్-1బీ వీసాపై వచ్చి ఎంతో మంది తమతమ స్వదేశాలకు వెళ్లకుండా దేశంలోనే ఉంటున్నారని, అలాంటి ఆక్రమణదారులను ఉపేక్షించేది లేదని ట్రంప్ ట్వీట్ చేశారు. దేశంలో అక్రమంగా ఉంటున్న వలసవాదుల్ని తక్షణమే బయటకు పంపే చర్యలు చేపడతామని తేల్చిచెప్పారు. ప్రస్తుతం అమలు చేస్తున్న ఇమ్మిగ్రేషన్ విధానం లోపభూయిష్టంగా ఉందని మండిపడ్డారు. సమూల మార్పులకు శ్రీకారం చుడతామని, ఇందులో మరో ఆలోచన లేదని చెప్పారు. విదేశీయులకు అమెరికాలో గ్రీన్ కార్డును మంజూరు చేయడానికి ఏడు శాతం కోటా వాధానాన్ని అనుసరిస్తున్నారు. అనధికార అంచనాల ప్రకారం, ప్రస్తుతం అనుసరిస్తున్న మార్గంలో దరఖాస్తులను పరిశీలించి, గ్రీన్ కార్డును మంజూరు చేయాలంటే కనీసం 70 సంవత్సరాలు పడుతుంది. ఇదే విషయాన్ని ట్రంప్ తన ట్విటర్ అకౌంట్‌లో పరోక్షంగా ప్రస్తావించారు. అమెరికా అనుసరిస్తున్న ఇమ్మిగ్రేషన్ విధానాన్ని చూసి ప్రపంచమంతా నవ్వుకుంటున్నదని వ్యాఖ్యానించారు. నిజానికి ఇమ్మిగ్రేషన్ అనేది ప్రతిభ ఆధారంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. దేశ నిర్మాణంలో భాగస్వాములయ్యే వారే తమకు అవసరమని, దేశానికి భారంగా మారే వారితో సమస్యలే తప్ప ఎలాంటి లాభం ఉందని పేర్కొన్నారు. ఎదో ఒక వీసాను తీసుకొని, దేశంలోకి వచ్చే వారిని 3ఆక్రమణదారులు2గా ట్రంప్ అభివర్ణించారు. అందుకే, ఇకపై కేసులుగానీ, కోర్టులుగానీ లేకుండా, అక్రమంగా దేశంలో ఉంటున్న ప్రతి ఒక్కరినీ వెనక్కు పంపిస్తామని అన్నారు. అత్యుత్తమ అమెరికాను తీర్చిదిద్దే వారికి స్వాగతం పలుకుతామని, అక్రమంగా ఉంటున్న వారిని వెళ్లగొడతామని స్పష్టం చేశారు.