అంతర్జాతీయం

ఇరుగు పొరుగుతో సఖ్యతే ప్రధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాఠ్మండూ, జూన్ 26: భారత్, చైనాలతో సుహృద్భావ సంబంధాలు కొనసాగించాలనే నేపాల్ కోరుకుంటున్నదని ఆ దేశ ప్రధాని కె.పి. శర్మ ఓలి పేర్కొన్నారు. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాలకోసం ఇరుగుపొరుగు దేశాలతో రాజకీయ క్రీడలు నెరపడంపై తమకు ఎంతమాత్రం విశ్వాసం లేదని మంగళవారం పార్లమెంట్‌కు తెలిపారు. ఇటీవల తాను చైనాలో జరిపిన ఆరురోజుల పర్యటన వివరాలను ఆయన పార్లమెంట్‌కు వివరించారు. ముఖ్యంగా రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను ఆయన ప్రత్యేకంగా పేర్కొనడం గమనార్హం. దేశానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు చైనా అంగీకరించిందని ఆయన వెల్లడించారు. నేపాల్ అభివృద్ధికి, భారత్, చైనాలతో సన్నిహిత సంబంధాలు నెరపడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందుకోసం రాజకీయ క్రీడ నెరపాల్సిన అవసరం లేదన్నారు. 2019 నాటికి తాతోపని ప్రవేశాన్ని పునరుద్ధరించాలని ఇరుదేశాలు నిర్ణయించాయన్నారు. రసువాగడి, కేరుంగ్‌లలో వౌలిక సదుపాయాల కల్పనకు చైనా అంగీకరించిందన్నారు. ‘రెండు దేశాల మధ్య కుదిరిన అత్యంత కీలకమైన రైలు అనుసంధానత వల్ల, ఆర్థికాభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుదన్నారు. బెల్ట్ అండ్ రోడ్ విషయం లో పరస్పర సహకారంకోసం కుదిరిన అవగాహనా ఒప్పందాన్ని మ రింత వేగంగా అమలు పరచేందుకు పరస్పరం అంగీకరించామన్నారు. ఓలీ చైనా పర్యటన ము గింపు సందర్భంగా 14 అంశాలతో కూడిన ఉమ్మడి ప్రకటన వెలువడింది. కాగా ఓలీ-జిన్‌పింగ్ మధ్య జరిగిన చర్చల్లో ప్రధానమైంది, టిబెట్‌ను కాఠ్మండూకు అనుసంధానించే రైల్వే లైన్ నిర్మాణం అంశం. టిబెట్‌లోని గిరాంగ్ వాణిజ్య పోర్టును నేపాల్ రాజధాని కాఠ్మండూకు ఈ లైన్ అనుసంధానిస్తుంది.