అంతర్జాతీయం

విశాఖ ఇంజనీర్ నైజీరియాలో కిడ్నాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 30: విశాఖకు చెందిన ఒక ఇంజనీర్ నైజీరియాలో కిడ్నాప్‌కు గురైయ్యారు. ఉత్తర మధ్య నైజీరియాలోని బోకో పట్టణంలో ఒక సిమెంట్ కంపెనీలో పని చేస్తున్న మంగినపూడి సాయి శ్రీనివాస్ (44) తోపాటు ఉత్తర భారతదేశానికి అతడి సహోద్యోగి అనీష్ శర్మను కూడా కిడ్నాప్ చేశారు. బోకో హరామ్ ఉగ్రవాదులు ఇందుకు పాల్పడినట్టుగా భావిస్తున్నారు. కిడ్నాప్ ఘటన బుధవారం జరిగినప్పటికీ శ్రీనివాస్ భార్య లలిత గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్‌ను, నగర పోలీస్ అధికారులను కలిసి పరిస్థితి వివరించడంతో ఇది వెలుగులోకి వచ్చింది. శ్రీనివాస్ విడుదలకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరింది. బుధవారం ఉదయం 7.30 గంటలకు శ్రీనివాస్, అనీష్ కలిసి తమ ఇళ్ల నుంచి మూడు కార్ల కాన్వాయ్‌తో తాము పని చేసే డాంగోటే సిమెంట్ ప్లాంట్‌కు వెళ్తున్నారు. మూడు కార్లలో చివరి కారులో వీరిద్దరూ ఉన్నారు. ముందు ఉన్న రెండు కార్లు సిగ్నల్ దాటి వెళ్లిపోవడంతో ఈ కారును కొంతమంది ఆయుధాలతో చుట్టుముట్టారు. డ్రైవర్‌ను లాగి కింద పడేసి ఇద్దరు భారతీయులను కిడ్నాప్ చేశారు. శ్రీనివాస్ భార్య లలిత మీడియాతో మాట్లాడుతూ సివిల్ ఇంజనీర్ అయిన తన భర్త గత మూడేళ్లుగా అక్కడ పని చేస్తున్నారని తెలిపారు. అంతకుముందు ఛత్తీస్‌ఘడ్‌లో పనిచేశారన్నారు. బుధవారం తన భర్తతో మాట్లాడేందుకు ప్రయత్నించగా, లైను కలువలేదని, దీంతో సిమెంట్ కంపెనీ అధికారులకు ఫోన్ చేశానని తెలిపారు. అక్కడి కంపెనీ అధికారులు గురువారం ఫోన్ చేసి ఈ విషయం చెప్పారన్నారు. కాగా, విశాఖకు చెందిన ఇంజనీర్ శ్రీనివాస్‌ను సురక్షితంగా విడిపించేందుకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శికి లేఖ రాశామని, దీనిపై న్యూఢిల్లీలోని నైజీరియా హైకమిషన్ ద్వారా ఆ దేశ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు.

చిత్రం.. నైజీరియాలో కిడ్నాప్‌కు గురైన విశాఖ సివిల్ ఇంజనీర్ సాయి శ్రీనివాస్