అంతర్జాతీయం

వ్యాక్సినేషన్ లేకుంటే వెనక్కే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, జూన్ 28: దేశంలో అంటువ్యాధులు సోకకుండా చేసేందుకు సింగపూర్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా తగిన వాక్సినేషన్ తీసుకోని టూరిస్టులను తమ దేశం నుంచి వెనక్కి పంపించివేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 5.6 మిలియన్ల జనాభా కలిగిన ఈ దేశాన్ని గత ఏడాది 17.4 మిలియన్ల మంది విదేశీయులు సందర్శించినట్లు లెక్కలు చెబుతున్నాయి. 2003లో జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని బర్డ్ ఫ్లూ, ఎబోలా వంటి అంటువ్యాధులు దేశంలోకి వ్యాపించకుండా చూసేందుకు వాక్సినేషన్ తీసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటన జారీచేసింది. అలాగే విదేశాల నుంచి వచ్చినవారు తప్పనిసరిగా వాక్సినేషన్ తీసుకోవాలని లేకుంటే తిరిగి పంపించేస్తామని హెచ్చరికలు జారీచేసింది. సింగపూర్‌లో 2003లో ‘సార్స్’ అనే అంటువ్యాధి సోకి దాదాపు 33 మంది మరణించారు. దీంతో ఆ ఏడాది ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. అంతర్జాతీయ టూరిస్టులు రావడం కూడా తగ్గిపోయింది. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.