అంతర్జాతీయం

సిరియా దక్షిణ ప్రాంతంపై రష్యా వైమానిక దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీరుట్, జూన్ 28: సిరియాలోని దక్షిణ ప్రాంతంలో తిరుగుబాటుదార్ల శిబిరాలపై రష్యన్ విమానాలు బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 22 మంది పౌరులు మరణించారు. ఆల్ సిఫ్రా పట్టణంపై రష్యా యుద్ధ విమానాలు 35 సార్లు దాడులు చేశాయని సిరియన్ మానవ హక్కుల నిఘా సంస్థ పేర్కొంది. ఒకచోట శిబిరంలో తలదాచుకుంటున్న 17 మంది ఈ దాడుల్లో మరణించారు. ఇందులో ఐదుగురు పిల్లలు కూడా ఉన్నారని బ్రిటన్‌కు చెందిన మానవ హక్కుల పర్యవేక్షణ బృందం పేర్కొంది. ఈ వైమానిక దాడుల తీవ్రతతో ఆసుపత్రిని కూడా మూసివేశారు. దారా ప్రాంతంలో చేపట్టిన వైమానిక దాడుల ఆపరేషన్‌లో ఐదుగురు మరణించారు. ఈనెల 19వ తేదీ నుంచి ఈ ప్రాంతంలో దాడులు తీవ్రం కావడంతో పౌరులు సురక్షిత స్థావరాలకు తరలి వెళుతున్నారు. ఇటీవల కాలంలో జరిగిన దాడుల్లో ఇంతపెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించడం ఇదే తొలిసారి అని సిరియా మానవ హక్కుల నిఘా సంస్థ ప్రతినిధి రామిఅబ్దుల్ రెహమాన్ తెలిపారు. ఈ ఏడాది ఈ ప్రాంతంలో రష్యా వైమానిక దాడులు తొలిసారిగా చేపట్టింది. కాగా ఈ ప్రాంతంలో సంఘర్షణను నివారించేందుకు రష్యా, అమెరికా, జోర్డాన్ గత ఏడాది అంగీకారానికి వచ్చాయి.