అంతర్జాతీయం

ట్రంప్‌కు షాక్ ఇచ్చిన యుఎస్ హౌస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: ఇమ్మిగ్రేషన్ విధానంలో కొత్త సంస్కరణలు తేవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌కు రిపబ్లికన్లు ఆధిపత్యం ఉన్న చట్టసభ గట్టి షాక్ ఇచ్చింది. సొంత పార్టీ తీరుతో ట్రంప్ ఖంగుతిన్నారు. మెరిట్ ప్రాతిపదికన ఇమ్మిగ్రేషన్ పద్ధతి ద్వారా గ్రీన్ కార్డుల కోటాను తగ్గించాలన్న కొత్త విధానాన్ని అమలు చేయాలనే బిల్లును ట్రంప్ ప్రభుత్వం యునైటెడ్ స్టేట్స్ హౌస్‌లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు అమలులోకి వస్తే అమెరికాలో పనిచేసే భారత్ తదితర దేశాల నిపుణులకు గ్రీన్ కార్డు కేటాయింపుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాగా ఈ బిల్లుకు వ్యతిరేకంగా 301 మంది, అనుకూలంగా 121 మంది ఓట్లు వేశారు. ఈ బిల్లు సరిహద్దు భద్రతా ఇమ్మిగ్రేషన్ సంస్కరణల చట్టంగా ట్రంప్ ప్రతిపాదించారు. పక్షపాత వైఖరితో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు ఆమోదం లభించకుండా రిపబ్లికన్లు అడ్డుకున్నారు. భారత్‌తో సహా అనేక దేశాల నుంచి వచ్చే నిపుణులకు గ్రీన్ కార్డు జారీ విషయంలో సత్వరమే చర్యలు తీసుకునేందుకు వీలు కల్పించే బిల్లును ఆమోదించాలని అంతకు ముందు ట్రంప్ సభ్యులను కోరారు. సెనెట్‌లో డెమాక్రట్లు ఈ బిల్లును ఆమోదించమని ఇప్పటికే చెప్పారని, సరిహద్దుల వద్ద భద్రత గట్టిగా ఉండాలని తాము కోరుకుంటున్నామని, కాని సరిహద్దులు తెరిచి ఉంచాలని డెమాక్రట్లు కోరుకుంటున్నారని ట్రంప్ ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. ఈ బిల్లులో కొంత మంచి సమాచారం ఉన్నా, ఈ బిల్లుహానికరమైందని ఎఫ్‌డబ్ల్యుడి. యుఎస్ అధ్యక్షుడు టోట్ షటిల్ తెలిపారు. సరిహద్దు భద్రత ఇమ్మిగ్రేషన్ సంస్కరణల చట్టం 2018 వల్ల లీగల్ ఇమ్మిగ్రేషన్ ఆధారిత దరఖాస్తుల సంఖ్యను పెంచరని ఆయన చెప్పారు. ఈ విధానం వల్ల కొత్త గ్రీన్ కార్డుల జారీ విధానం అమలులోకి వస్తుందన్నారు. కాని ఈ బిల్లును హౌస్ ఆమోదించలేదని ఆయన చెప్పారు.