అంతర్జాతీయం

అమెరికాలో జర్నలిస్టుల కాల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 29: అమెరికా మీడియా చరిత్రలో విషాదం చోటు చేసుకుంది. మీడియాపై అకారణ ద్వేషం పెంచుకున్న ఒక యువకుడు ఆధునిక ఆయుధాలతో కాపిటల్ గెజిట్ పత్రికాఫీసులోకి చొరబడి జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. షాట్‌గన్, స్మోక్ గ్రెనేడ్లతో సాయుధ యువకుడు దాడికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. ఈ నరహంతకుడి పేరు జరాడ్ రామోస్ అని, 38 ఏళ్ల ఈ వ్యక్తిని అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నట్లు అన్నాపొలిస్ నగర పోలీసులు చెప్పారు. ఈ పత్రిక సంస్థ నుంచి కాపిటల్ గెజిట్ అనే పత్రిక వెలువడుతోంది. అమెరికా మీడియా చరిత్రలో ఇంత తీవ్రస్థాయిలో రక్తపాతం సంఘటన చోటుచేసుకోలేదని పోలీసులు చెప్పారు. ఈ మీడియా కార్యాలయంలోకి చొరబడి ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపి దొరికిన వారిని దొరికినట్లుగా చంపాలనే ప్రతీకారంతోనే జరాడ్ రామోస్ ప్రవేశించినట్లు పోలీసు అధికారి విలియన్ క్రాంఫ్ చెప్పారు. మరణించిన వారిలో అసిస్టెంట్ ఎడిటర్ రాబ్ హియాసెన్, ఎడిటోరియయల్ పేజి ఎడిటర్ గెరాల్డ్ ఫిచ్‌మ్యాన్, ఎడిటర్ ఆజన్ మెక్‌నమారా, స్పెషల్ పబ్లికేషన్స్ ఎడిటర్ వెండి వింటర్స్, సేల్స్ అసిస్టెంట్ రెబాకా స్మిత్ ఉన్నారు. ఈ పత్రికపై పరువునష్టం దావా దాఖలు చేయగా కోర్టు కేసును కొట్టివేయడంతో నిందితుడు ప్రతీకారంతో రగిలిపోతున్నాడని పోలీసులు చెప్పారు. 2011లో ఈ పత్రిక కాలమ్‌లో తనకు వ్యతిరేకంగా వార్తలు రాశారని జరాడ్ కోర్టులో దావా వేశాడు. ఈ ఘటనను అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఖండించారు. కాగా వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ లిండ్సే వాల్టర్స్ ఈ ఘటనను ప్రజాస్వామ్యానికి మచ్చగా అభివర్ణించారు. హింసకు తావులేదని, ఈ ఘటనపై అధ్యక్షుడు ట్రంప్ దిగ్భాంత వ్యక్తం చేసినట్లు చెప్పారు. కాగా కాపిటల్ గెజిట్‌పై దాడి, ఐదుగురు జర్నలిస్టుల కాల్చివేత ఘటనపై అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కులు, జర్నలిస్టు సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి.

చిత్రం..జర్నలిస్టుల కాల్చివేత సంఘటన జరిగిన కాపిటల్ గెజిట్ పత్రికా ఆఫీసు