అంతర్జాతీయం

ఆంక్షలు ఎత్తివేసేలా చూడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, జూలై 1: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఇటీవల జరిగిన శిఖరాగ్ర సమావేశం పూర్తిగా విజయవంతమైన నేపథ్యంలో తమపై ఇంతవరకు విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చైనా నేత జిన్‌పింగ్‌కు విజ్ఞప్తి చేసినట్టు ఒక జపనీస్ పత్రిక వెల్లడించింది. గత నెలలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ జరిపిన సమావేశమైన సంగతి తెలిసిందే. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జరిపిన సమావేశంలో అణు నిరాయుధీకరణకు ఉత్తరకొరియా అంగీకరించింది. అయితే ఆ దేశంపై విధించిన ఆంక్షలు కొనసాగుతాయని ట్రంప్ ప్రకటించారు. తమదేశంపై అనేక ఆర్థిక ఆంక్షలు విధించడం వల్ల పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అమెరికాతో జరిగిన సమావేశం పూర్తి సంతృప్తి స్థాయిలో జరిగినందున ఇంతవరకు తమపై విధించిన ఆంక్షలు ఎత్తివేయడానికి చైనా చొరవ చూపాలని ఉత్తర కొరియా కోరింది. గతంలో కిమ్ అణుపరీక్షలు నిర్వహించడం, అమెరికా ఇతర దేశాలకు కాలు దువ్వడం, దాంతో ఐక్యరాజ్యసమితి ఉత్తరకొరియాపై ఆంక్షలు విధించడం, దానిని చైనా సమర్థించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమపై ఆంక్షలు రద్దు చేయడానికి చైనా మాత్రమే తమకు దౌత్యపరంగా సహకరించగలదని కొరియా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అది చైనాను ఆశ్రయించింది. కాగా కొరియా విజ్ఞప్తికి చైనా సానుకూలంగా స్పందించిందని, ఆ దేశంపై విధించిన ఆర్థిక, ఇతర ఆంక్షలను తొలగించడానికి దౌత్యపరంగా తాము ప్రయత్నిస్తామని, అమెరికా, ఇతర దేశాలతో చర్చిస్తామని, ఈ విషయంలో కొరియా నిత్యం అందుబాటులో ఉండాలని హామీ ఇచ్చినట్టు జపనీస్ పత్రిక పేర్కొంది.