అంతర్జాతీయం

కిమ్‌తో ట్రంప్ చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, జూలై 1: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చల ద్వారా జపాన్ ఆయుధాల కొనుగోలు, మిసైళ్ల పరీక్షలు, ప్రదర్శన పోటీ నుంచి తగ్గుముఖం పట్టింది. ఇటీవల కిమ్‌తో ట్రంప్ సమావేశమై ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణకు తలొగ్గాల్సిందేనని కోరిన విషయం విదితమే. దీంతో జపాన్ మిసైళ్ల ఎక్కువ సంఖ్యలో తయారు చేయాలని, సేకరించాలన్న విధానంపై పునరాలోచనలో పడింది. గతంలో ఉత్తరకొరియా, జపాన్ మధ్య ఉద్రిక్తతలు ఉండేవి. కిమ్, ట్రంప్ చర్చల తర్వాత ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నట్లు రక్షణ రంగానికి చెందిన ఒక ఏజన్సీ వెల్లడించింది. జపాన్ తూర్పు సముద్రంలో మిసైళ్ల ప్రయోగాన్ని పసిగట్టే యుద్ధ నౌకల విన్యాసాల కార్యక్రమాన్ని జపాన్ విరమించుకుంది. కాని మిసైళ్ల దాడి జరిగితే తిప్పిగొట్టేందుకు జపాన్ సైన్యం సిద్ధంగా ఉందని ఆసాహిషింబూన్ అనే ఏజన్సీ పేర్కొంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలోని పరిస్థితులు, ఉద్రిక్తతలపై గతంలో ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసేది. తాజా పరిణామాలతో ఐరాస కూడా హెచ్చరిక ప్రకటనలు చేయడం లేదు. జపాన్ రక్షణ నిమిత్తం ప్రయోగాత్మకంగా మిసైళ్ల పరీక్షలను నిర్వహించేది. దీని నిమిత్తం జనావాసాలను ఖాళీ చేయించేది. ఇటీవల కాలంలో మిసైళ్ల ప్రయోగాలకు జపాన్ స్వస్తి చెప్పింది. ఉత్తర కొరియాతో అమెరికా జరిపిన చర్చల్లో తమను విశ్వాసంలోకి తీసుకోలేదని, భాగస్వాములను చేయలేదనే బాధ జపాన్‌కు ఉందని రక్షణ మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. కిమ్‌తో చర్చలు జరిపిన తర్వాత ట్రంప్ ఏకపక్షంగా దక్షిణ కొరియాతో కలిసి యుద్ధ విన్యాసాలు చేయమని ప్రకటించారు. ట్రంప్‌తో చర్చలకు ముందే కిమ్‌తో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ రెండు సార్లు చర్చలు జరిపారు.