అంతర్జాతీయం

వీసా విధానాలపై నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 1: వివాదాస్పదమైన ఇమ్మిగ్రేషన్ విధానాలను అవలంబిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిపై ఆ దేశంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇండియన్ అమెరికన్లు సహా వేలాది మంది ట్రంప్ చర్యలపై ఆగ్రహం వ్యక్తం ఆ దేశంలోని పలు నగరాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ‘తల్లీబిడ్డలను వేరు చేసే ట్రంప్ వీసా విధానాలు మాకొద్దు’ అంటూ నినదించారు. ట్రంప్ తీసుకున్న చర్యల వల్ల అమెరికాకు తమవారితో వస్తున్న వలసవాదుల పిల్ల లు రెండు వేల మంది వారి తల్లిదండ్రుల నుంచి వేరయ్యారని, తమవారు లేక ఆ పిల్లలు అల్లాడారని నిరసనకారులు పేర్కొన్నారు. వైట్‌హౌస్‌కు సమీపంలోని పార్కులో ఇమ్మిగ్రేషన్ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రదర్శన నిర్వహించి నినాదాలు చేశారు. దేశంలో పలుచోట్ల జరిగిన ఈ నిరసన కార్యక్రమాలకు డెమోక్రాటి క్ పార్టీ నాయకులు, పౌరహక్కుల నేతలు ఆధ్వర్యం వహించారు. ఇలావుండగా తమ దేశంలోకి అక్రమం గా వస్తున్న వారిని నివారించడానికి ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని ట్రంప్ పాటిస్తున్నారు. ఈ పద్ధతిలో వలసవాదులను సంవత్సరాల తరబడి కోర్టుల్లో విచారించడం వంటి విధానాలు పాటించకుండా వారిని వచ్చినట్టే వారిని ఆయా దేశాలకు తిప్పి పంపిస్తారు.