అంతర్జాతీయం

హమ్మయ్య.. పిల్లలు బయటపడ్డారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ సాయ్ (థాయిలాండ్): ప్రజల ప్రార్థనలు.. అధికారుల దృఢచిత్తమైన కృషి ఫలించింది. గత 15 రోజులుగా చిమ్మ చీకటి.. చుట్టూ నీరు.. వెళ్లడానికి సరైన దారి లేని థాయిలాండ్‌లోని గుహల్లో తిండీతిప్పలు లేకుండా చిక్కుకుని ఉన్న ఫుట్‌బాల్ కోచ్, 12 మంది పిల్లల్లో ఆరుగురిని అధికారులు ఆదివారం సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మిగిలిన వారిని కూడా బయటకు తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆదివారం ఉదయం తన పని మొదలుపెట్టిన రెస్క్యూ టీమ్ నీటితో నిండి ఇరుకుగా ఉన్న చీకటి గుహలో సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో చిక్కుకుపోయిన బాలల బృందంలో ఆరుగురిని అతి కష్టం మీట బయటకు తీసుకువచ్చారు. 11నుంచి 16 సంవత్సరాల వయసు ఉండి, ఎలాంటి ఈతరాని పిల్లలను బయటకు తీసుకురావడానికి అధికారులు తొలుత అనేక ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా వరదనీటిలో చిక్కుకుపోయిన గుహలో నుంచి పిల్లలను తీసుకురావడం రిస్కే. వారిని రక్షించడానికి వెళ్లి తిరిగి వస్తున్న డైవర్ ఆక్సిజన్ అందక శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన 13మంది ప్రపంచప్రఖ్యాత డైవర్లు, థాయ్ నేవి అధికారులతో కూడిన టీము పిల్లలను ఎలాగైనా బయటకు తేవాలని నిర్ణయించుకుంది. నీటి ప్రవాహం పైన ఎత్తయిన దిబ్బపై ఉన్న పిల్లల వద్దకు ఈ బృందం చేరుకుంది. నీరు, మురికి, మడ్డితో నిండి ఉన్న గుహలో ఇద్దరు డైవర్లు ఒక్కో బాలుడికి రక్షణగా నిలిచారు. తాడు, టార్చిలైట్లు, ఇతర రక్షణ పరికరాల సాయంతో బయటకు తీసుకువచ్చారు. బాలురు చిక్కుకున్న ప్రదేశానికి చేరడానికి బృందానికి ఐదుగంటలు పట్టగా, వారిలో మొదటి బృందాన్ని తీసుకురావడానికి ఆరు గంటలు పట్టింది. ఇన్ని రోజులు తిండీ, నీరు, గాలి, వెలుతురు సరిగ్గా లేక తీవ్రంగా నీరసించిపోయిన బాలురకు ఆహారం, మందులు అందజేసి, అనంతరం వారిని ఆసుపత్రికి తరలించారు. 11 బాలలు, ఒక కోచ్‌తో కూడిన ఫుట్‌బాల్ టీమ్ ఎవరికీ చెప్పకుండా థాయ్‌లోని గుహల్లోకి గత నెల వెళ్లారు. అయితే గుహలోకి కొన్ని కిలోమీటర్లు వెళ్లిన తర్వాత హఠాత్తుగా వరద నీరు గుహను ముంచెత్తడంతో వారు తోచిన వైపుకు పరుగులు పెట్టారు. దానికి తోడు వారు వచ్చే దారి నీటితో నిండిపోవడమే కాక మూసుకుపోయింది. దాంతో వారు బయటకు వచ్చే మార్గం లేక అందులోనే అన్నపానీయాలు లేక అల్లాడుతూ ఉండిపోయారు. తర్వాత వారి ఉనికిని అతికష్టం మీద కనుగొన్న అధికారులు వారిని బయటకు తేవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే గుహలో నీరు ఉండటం, దారి చాలా ఇరుకుగా ఉండటం, పిల్లలెవరికీ ఈత రాకపోవడం, అక్కడ కురుస్తున్న వర్షాల వల్ల నీటి ప్రవాహం గుహల్లోకి వెళ్లడంతో అధికారులకు వారిని బయటకు తీసుకురావడం కష్టసాధ్యంగా తోచింది. తొలుత గుహలోని నీటిని బయటకు తీయాలని భావించి నీటిని నిరంతరంగా తోడటం ప్రారంభించారు. తర్వాత గుహకు పై నుంచి రంధ్రాలు పెట్టడం తదితర ప్రయత్నాలు కూడా చేశారు. పిల్లలను బయటకు రప్పించడానికి నెలల సమయం పడుతుందని తొలుత భావించారు. అంతవరకు వారికి ధైర్యం చెప్పడానికి రెస్క్యూ బృందాలను ఆహారం, మందులు ఇచ్చి పంపించసాగారు. ఎట్టకేలకు వారిలోని ఆరుగురిని ఆదివారం రక్షించి బయటకు తీసుకువచ్చారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో వెయ్యి మందికి పైగా మిలటరీ సిబ్బంది, వాలంటీర్లు ఇందులో పాల్గొన్నారు. పిల్లలంతా క్షేమంగా బయటపడాలని ఆ దేశ ప్రజలే కాక, ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రార్థనలు చేశారు.

చిత్రాలు..థాయ్‌లో గుహ నుంచి సురక్షితంగా బయటపడిన విద్యార్థులు..
*కొనసాగుతున్న సహాయ చర్యలు