అంతర్జాతీయం

టర్కీలో పట్టాలు తప్పిన రైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్తాంబుల్, జూలై 9: టర్కీలు ఆదివారం ఒక రైలు పట్టాలు తప్పడంతో 24 మంది మృతిచెందగా, వందలాదిమంది గాయపడ్డారు. దాదాపు 360 మంది ప్రయాణికులతో గ్రీక్-బల్గేరియా సరిహద్దు నుంచి ఇస్తాంబుల్‌లోని హల్‌కాలీ స్టేషన్‌కు వెళుతున్న రైలు కార్లు జిల్లాలోని సిరిలార్ గ్రామం వద్ద పట్టాలు తప్పింది. దీంతో రైల్లోని ఆరు బోగీలు నేలకొరిగాయి. భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాక్ కోతకు గురికావడంతో ప్రమాదం జరిగినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో 124 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషాదకర సంఘటనపై విచారణకు ఆదేశించినట్లు టర్కీ ప్రభుత్వం తెలిపింది. ప్రమాదం జరిగిన వెంటనే సంబంధిత సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పట్టాలు తప్పిన బోగీలను సోమవారం ఉదయం తొలగించారు. పట్టాలను పునరుద్ధరించడానికి మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ప్రమాదంలో 24 మంది మరణించారని మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని వివిధ వార్తా సంస్థలు ప్రసారం చేశాయి.