అంతర్జాతీయం

ఆ బాలలు మృత్యుంజయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చియాంగ్‌రాయ్, జూలై 10: థాయ్‌కేవ్ ఆపరేషన్ విజయవంతమైంది. థాయ్‌లోని ఒక గుహలో చిక్కుకున్న ఫుట్‌బాల్ కోచ్, 12 మంది బాలురు ఎట్టకేలకు సురక్షితంగా బయటపడటంతో ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆదివారం నుంచి అధికారులు నిరంతరంగా చేపట్టిన రిస్క్యూ ఆపరేషన్ పూర్తిగా విజయవంతమైంది. గుహలో చిక్కుకున్న 13 మంది క్షేమంగా బయటకు వచ్చారు. జూన్ 23న గుహను చూడటానికి తమ కోచ్‌తో పాటు వెళ్లిన 12 మంది బాలురు హఠాత్తుగా అందులోకి వరద రావడంతో నాలుగు కిలోమీటర్ల దూరంలో వెనక్కివచ్చే మార్గం లేక చిక్కుకుపోయారు. వీరి జాడను కనిపెట్టిన అధికారులు పెద్దయెత్తున గుహ వద్దకు చేరుకుని రిస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఆదివారం ప్రారంభించిన ఆపరేషన్‌లో నీరు, బురద, కొండరాళ్ల మధ్య నలుగురు బాలురను బయటకు తీసుకువచ్చారు. తర్వాత సోమవారం నలుగుర్ని, మంగళవారం కోచ్ సహా మిగిలిన నలుగురు బాలురని బయటకు తీసుకువచ్చారు. బయటకు తీసుకువచ్చిన బాలురందరూ ఆరోగ్యంగానే ఉన్నారని, ఆది, సోమవారం బయటకు తీసుకువచ్చిన వారిలో కొందరు చాక్‌లెట్, బ్రెడ్, అల్పాహారం అడిగారని అధికారులు తెలియజేశారు. అయితే ఇద్దరు బాలురికి ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ సోకినట్టు అనుమానిస్తున్నారు. ఏదిఏమైనా మొదటి గ్రూప్‌లో బయటకు వచ్చిన వారిద్దరూ ఇప్పుడు హాస్పిటల్‌లో హుషారుగా ఉన్నారని వారు చెప్పారు. అయితే బయటపడ్డ వారిని కలుసుకోవడానికి వారి తల్లిదండ్రులకు ఇంకా అనుమతి ఇవ్వలేదని, వారికి అంటురోగాలు, ఇతర వ్యాధులు ఏమన్నా సోకాయన్న అనుమానంతో వారం రోజుల పాటు వారిని ఆసుపత్రిలో ఉంచి పరీక్షిస్తామని చెప్పారు. గుహలో చిక్కుకున్న వారిని రక్షించడానికి తన కంపెనీ తయారు చేసిన అతిచిన్న సబ్‌మేరైన్ వైల్డ్‌బార్‌తో బిలియనర్, స్పేస్ ఎక్స్ అధినేత ఇలాన్ ముస్క్ సోమవారం గుహవద్దకు తన టీమ్‌తో చేరుకున్నారు. అవసరమైతే దానిని వినియోగించడానికి సిద్ధం చేసినట్టు థాయ్‌లాండ్ మంత్రి అనుపాంగ్ పాచొండి తెలిపారు. గుహలో చిక్కుకున్న 13 మంది క్షేమంగా రావడం పట్ల ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బాలల్లో ఆరుగురు మేసాయి ప్రాసిట్సార్ట్ స్కూల్ విద్యార్థులే. తమ విద్యార్థులు క్షేమంగా తిరిగి రావాలని చేసిన ప్రార్థనలు ఫలించాయని ఆ స్కూల్ ప్రతినిధి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అందరూ క్షేమంగా బయటకు రావడానికి తీవ్రంగా కృషి చేసిన గత ఈతగాళ్లు, ఇతర రిస్క్యూటీమ్ సభ్యులపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
చిత్రం..బాలలు చిక్కుకున్నది ఈ గుహలోనే