అంతర్జాతీయం

చైనాలో పడిపోతున్న సంతానోత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూలై 10: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రెండోస్థానంలో కొనసాగుతున్న చైనా జనాభా విషయంలో దిగిజారిపోతోందా? అంటే ఔననే అంటున్నారు విశే్లషకులు. ఓ సర్వే ప్రకారం 2050నాటికి చైనా జనాభా భారత జనాభాలో 65 శాతానికి పడిపోతుందని అంచనా వేస్తున్నారు. దీనికి కారణం చైనా వాసుల్లో సంతానోత్పత్తి పడిపోవడంతోపాటు ఆ దేశం అవలంబిస్తున్న జనాభా విధానమేనని ఆ సర్వే చెబుతోంది. జనాభాలో చైనా ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. జనాభా నియంత్రణలో భాగంగా ఆ దేశం 1979లో చేపట్టిన ‘ఒక్కరు’ మాత్రమే విధానం 2016తో ముగిసింది. ప్రస్తుతం ‘ఇద్దరు పిల్లలు’ విధానం కొనసాగుతోంది. అయినప్పటికీ గతంలో అవలంభించిన విధానంలో వల్ల జనాభా క్షీణదశకు చేరుకుందని చైనాకు చెందని అమెరికా రిసెర్చ్ స్కాలర్ వారుూ ఫుకైన్ విశే్లషించారు. 2016 లెక్కల ప్రకారం చైనా జనాభాలో 230.8 మిలియన్లు మంది 60 ఏళ్లు పైబడినవారే ఉండడం ఆందోళన కలిగించే అంశమని ఆయన తెలిపారు. చైనా ఇదే విధానాన్ని కొనసాగిస్తే 2050 నాటికి భారత జనాభాలో 65 శాతానికి, 2100 నాటికి 32 శాతానికి దిగజారిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 1979లో మొదలైన ‘వన్‌చైల్డ్’ పాలసీ వల్ల చైనా 400 మిలియన్ల జననాలను ఆపగలిగింది. దానివల్ల ఆర్థిక వ్యవస్థ బలోపైతం అయిన విషయం వాస్తవమే అయినప్పటికీ వయస్సు నిష్పత్తిలో దిగజారిపోయిందని ఆయన అన్నారు. భారత్‌లో జనాభా నియంత్రణలో ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకపోయినప్పటికీ 1970లో 5.6 శాతం ఉన్న జనాభా పెరుగుదల 2017నాటికి 2.18 శాతానికి పడిపోయింది. భారత్‌లో పోల్చుకుంటే చైనాలో జనాభా పెరుగుదల శాతం విపరీతంగా పడిపోయింది. అయితే జనాభా విధానంలో కఠిన నిర్ణయాలు తీసుకోవడంవల్లే ఆర్థిక వ్యవస్థలో పురోగతి సాధించగలిగామని చైనా జనాభా మరియు అభివృద్ధి రిసెర్చ్ సెంటర్‌కు చెందిన మాజీ అధికారి మా లీ విశే్లషించారు. సంతానోత్పత్తి పడిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విధానాలను సరిచేసుకోవాలని ఆయన సూచించారు. అయితే అందుకు ప్రభుత్వాలు కొన్ని సౌకర్యాలు కల్పించాలని, కిండర్‌గార్డెన్ సూళ్లను ఎక్కువగా స్థాపించడంతోపాటు సూళ్లలో ఫీజులను భారీగా తగ్గించాలని ఆయన సూచించారు.