అంతర్జాతీయం

పాక్ రక్తసిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో క్వెట్టా ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 70 మంది మరణించారు. 120 మందికి తీవ్రంగాయాలయ్యాయి. ఎన్నికల ర్యాలీని లక్ష్యంగా చేసుకుని తాలిబాన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఆత్మాహుతి బాంబర్ ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 25వ తేదీన పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హింసాత్మక సంఘటన చోటు చేసుకుంది. గత ఏడాదితో పాకిస్తాన్‌లో జరిగిన అతి పెద్ద ఆత్మాహుతి దాడి అని పోలీసులు చెప్పారు. బలూచిస్తాన్ ఆరోగ్య శాఖ మంత్రి ఫైజ్ కాకర్ మాట్లాడుతూ ఈ ఘటనలో 70 మంది వరకు మరణించినట్లు సమాచారం ఉందని ధృవీకరించారు. ఈ ర్యాలీలో వెయ్యి మంది వరకు ప్రజలు పాల్గొన్నారు. ఈ దాడిలో బలూచిస్తాన్ ప్రొవెన్షియల్ అసెంబ్లీ అభ్యర్థి సిరాజ్ రైసాని మరణించాడు. 2008 నుంచి 2013 మధ్య బలూచిస్తాన్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నవాబ్ అస్లాం రైసాని సోదరుడు సిరాజ్ రైసాని అని పోలీసులు చెప్పారు. ఆత్మాహుతి దాడిలో మరణించిన తన సోదరుడు సిరాజ్ రాజకీయ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవారని సిరాజ్ సోదరుడు హాజి లష్కారి తెలిపారు. ఎన్నికల ర్యాలీలో సిరాజ్ రైసాని మరో కొద్ది సేపట్ల ప్రసంగిస్తారనంగా ఆత్మాహుతి దాడి జరిగినట్లు సీనియర్ పోలీసు అధికారి
ఖాయమ్ లష్కరి చెప్పారు. అంతకుముందు రైసాని కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతిదాడికి పాల్పడాలని తాలిబాన్లు వ్యూహం పన్నారు. కాగా ఈ ఘటనతో దేశ వ్యాప్తంగా సైన్యం, పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశవ్యాప్తంగా తనిఖీలు, సోదాలు ముమ్మరం చేశారు. కాగా ఇదే ప్రాంతంలో బన్ను అనే పట్టణం వద్ద జరిగిన బాంబుపేలుళ్లలోనలుగురు వ్యక్తులు మరణించారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీతో పొత్తుపెట్టుకున్న ఎంఎంఏ పార్టీకి చెంన నేత ఆక్రం ఖాన్ దుర్రాని కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు పాల్పడ్డారు. గత మంగళవారం పెషావర్‌లో ఆత్మాహుతి దాడిలో 20 మంది మరణించిన విషయం విదితమే. ఈ ఘటనలో హెరూన్ బైలూర్ అనే రాజకీయ నాయకుడు మరణించాడు. ఈ దాడికి తామే పాల్పడినట్లు పాకిస్తాన్ తాలిబాన్ల సంస్థ ప్రకటించింది.