అంతర్జాతీయం

ఉగ్రవాద అకౌంట్లను తొలగించిన ఫేస్‌బుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, జూలై 15: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి ఈ నెల 25వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ రంగంలోకి దిగింది. ఉగ్రవాద సంస్థలు ఫేస్‌బుక్ సేవలను వినియోగించుకోకుండా వారి అకౌంట్లను స్తంభింపచేసింది. ఇస్లామిస్ట్ మిల్లి ముస్లిం లీగ్ (ఎంఎంఎల్)కు చెందిన ఫేస్‌బుక్ అకౌంట్లను నిలిపివేస్తున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది. ముంబాయి టెర్రరిస్టు దాడుల సూత్రధారి హఫీజ్ సరుూద్‌కు చెందిన జమాత్ ఉద్ దావాకు చెందిన ఫేస్‌బుక్ అకౌంట్లను నిలిపివేశారు. ఈ వివరాలను ఫేస్‌బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుక్‌బర్గ్ తెలిపారు. పాకిస్తాన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉగ్రవాద సంస్థలు సమాజ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పాకిస్తాన్ మాత్రమే కాకుండా భారత్, బ్రెజిల్, మెక్సికో, ఇతర దేశాలకు ఎన్నికలు జరిగే సమయంలో ఇదే నిర్ణయాన్ని తీసుకుంటామన్నారు. ఇటీవల పాకిస్తాన్ ఎన్నికల సంఘం ఫేస్‌బుక్ సంస్థ నిర్వాహకులను సంప్రదించింది. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఫేక్ అకౌంట్లను తొలగించాలని కోరింది. ఎంఎంఎల్‌ను రాజకీయ పార్టీగా గుర్తించడం లేదని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎంఎంఎల్ సంస్థను అమెరికా నిషేధించింది. పైగా విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ సంస్థకు లష్కర్ తోయిబా అనే ముష్కర ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. కాగా ఈ ఎన్నికల్లో 200 మంది అభ్యర్థులు ఎంఎంఎల్ తరఫున పోటీ చేస్తున్నట్లు హఫీజ్ సరుూద్ ప్రకటించారు. అల్లా హో అక్బర్ టెహ్రిక్ అనే పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో ఎంఎంఎల్ సంస్థ పోటీ చేస్తోంది. ఎంఎంఎల్ అధికార ప్రతినిధి తబీష్ ఖయూమ్ మాట్లాడుతూ పేస్‌బుక్‌లో అనేక రాజకీయ పార్టీల ప్రతినిధులు, పార్టీల అకౌంట్లను తొలగించారన్నారు. తన నియమాలను తానే ఉల్లంఘించిందని ఆయన ఫేస్‌బుక్‌ను విమర్శించారు. అన్ని రాజకీయ పార్టీలు ఫేస్‌బుక్ ద్వారా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయన్నారు. కొంత మంది వీడియో సందేశాలుకూడా ఇస్తున్నారన్నారు. కొత్త ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ద్వారా ఫేక్ అకౌంట్లను తొలగిస్తున్నట్లు ఫేస్‌బుక్ యాజమాన్యం పేర్కొంది.