అంతర్జాతీయం

షరీఫ్‌ను కోర్టులో హాజరు పర్చాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 9: పాక్ మాజీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్‌ను సోమవారం కోర్టులో హాజరుపర్చాల్సిందేనని పాకిస్తాన్ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పటికే అవినీతి కేసులో పదేళ్ల జైలు శిక్షపడి రావల్పిండి జైలులో శిక్ష అనుభవిస్తున్న షరీఫ్‌పై మరో రెండు కేసుల విచారణకు సంబంధించి అతను సోమవారం కోర్టుకు హాజరు కావాలని జడ్జి మాలిక్ ఆదేశించారు. నవాజ్ షరీఫ్‌పై మూడు అవినీతి కేసులు నమోదు కాగా, లండన్‌లో అక్రమంగా నాలుగు లగ్జరీ ఫ్లాట్లను కొన్నారన్న ఆరోపణపై షరీఫ్‌కు పదేళ్లు, అతని కుమార్తె మరియంకు ఏడేళ్లు, అల్లుడు మహ్మద్ సఫర్‌కు సంవత్సరం జైలు శిక్షను విధిస్తూ అకౌంటబిలిటీ కోర్టు జడ్జి అర్షద్ మాలిక్ ఈ ఏడాది జూలై ఆరున విక్ష విధించడంతో వారిని రావల్పండి జైలుకు తరలించారు. తనకు శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ జూలై 16న షరీఫ్ కోర్టులో సవాల్ చేయడమే కాక, తనపై ఉన్న మిగిలిన రెండు కేసులను వేరొక కోర్టుకు బదిలీ చేయాలని విన్నవించాడు. దీనిని విచారించిన ఇస్లామాబాద్ హైకోర్టు (ఐహెచ్‌సి) గతవారం షరీఫ్ వినతిని అంగీకరించి కేసును మరో అకౌంటబులిటీ కోర్టుకు బదిలీ చేసింది. కేసును విచారించిన జడ్జి మాలిక్ ఈ కేసులో నిందితులైన షరీఫ్, అతని ఇద్దరు కు మారులు విచారణ నిమిత్తం సోమవారం కోర్టుకు హాజరు కా వాలని ఆదేశించారు. అయితే భద్రతా కారణాల వల్ల షరీఫ్‌ను కోర్టుకు హాజరుపర్చలేమని అతని తరఫు లాయర్ కోర్టుకు వి న్నవించగా, దానిని కోర్టు తిరస్కరిస్తూ నవాజ్ షరీఫ్‌ను సోమవారం తప్పనిసరిగా కోర్టుకు హాజరుపర్చాలని ఆదేశాలు జారీ చేసి కేసును వాయిదా వేసింది. కాగా షరీఫ్‌పై నమోదైన మూ డు కేసుల్లోనూ షరీఫ్ ఇద్దరు కుమారులు సైతం సహ నిందితులుగా ఉన్నారు. అయితే వారు పరారీలో ఉండటంతో ప్రభు త్వం వారి పాస్‌పోర్టులను రద్దు చేసి బ్లాక్‌లిస్టులో పెట్టింది.