అంతర్జాతీయం

అమెరికాలో భారత సాంస్కృతిక వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఆగస్టు 9: భారతీయ కళలు, సంస్కృతి, సారస్వతాలు, సాహితీ సంపద ఔన్నత్యాన్ని తెలుపుతూ అమెరికాలో ఓ కార్యక్రమం చేపడుతున్నారు. యుఎస్‌లోని ఓ ప్రముఖ సాంస్కృతిక సంస్థ దీనికి నడుం బిగించింది. భారతీయ సంస్కృతీ సౌరభాలు, వాణిజ్యం, విధానాలు వివిధ కోణాల్లో ఆవిష్కృతం కానున్నాయి. ‘సీజన్ ఆఫ్ ఇండియా’పేరుతో ప్రదర్శనలు, సాహితీ పండుగలు ఏర్పాటు చేస్తున్నారు. న్యూయార్క్ నగరంలోని ఆసియా సొసైటీ మ్యూజియంలో సెప్టెంబర్ 14 నుంచి జనవరి 20 వరకూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కళలు, సామాజిక, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన ప్రముఖులు రానున్నట్టు సొసైటీ వెల్లడించింది. చిత్రకళకు సంబంధించి 80 రకాలు ఉంటాయి. 1940 నుంచి 1990 వరకూ వివిధ సంఘటనలను ప్రతిబింబించేలా ఆయుల్ పెయింటింగ్స్ ప్రదర్శిస్తారు. అలాగే ‘ఇండియా 2050’తో ఓ చర్చాగోష్ఠిని ఏర్పాటు చేస్తారు. దీనిలో ప్రముఖ వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులు, ఆర్థిక నిపుణులు చర్చలో పాల్గొంటారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి ఏ విధంగా ముందుగు వెళ్లాలన్నదానిపై ప్రముఖులు చర్చిస్తారని నిర్వాహకులు వెల్లడించారు. ఈ చర్చల్లో నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, ఆయుర్వేద, హెర్బల్ కేర్ కంపెనీ బయోటిక్ వ్యవస్థాపకులు, చైర్మన్ వినితా జైన్, కేపీఎంజీ చైర్మన్, సీఈవో అరుణ్ కుమార్, యుఎస్‌లో భారత రాయబారి నవ్‌తేజ్ శర్నా పాల్గొంటారు. శర్నా, కార్డియాలజిస్ట్, న్యూయార్క్ టైమ్స్‌లో కాలమిస్ట్ సందీప్ జవహార్, చర్మ కేన్సర్ సర్జన్, కథా రచయిత శరద్‌పాల్, విద్యావేత్త జేమ్స్ షాపిరో, రచయిత, జర్నలిస్టు ప్రీతి తనేజా, రాజకీయవేత్త, రచయిత శశిథరూర్, కొరియోగ్రాఫర్లు హరి కృష్ణన్, పరూల్ షా, కుల్‌దీప్ సింగ్ ప్రసంగిస్తారని ఆసియా సొసైటీ డైరెక్టర్లు నమిత గోఖలే, విలియమ్ డ్రైంపుల్ వెల్లడించారు. భరతనాట్యం, ఒడిస్సీ, కథక్ వంటి సంప్రదాయ నృత్యాలు ప్రదర్శిస్తారు. స్వాతంత్య్రానికి పూర్వం చిత్రకళ, కళ, సైన్స్, పరిశ్రమలపై హార్వర్డ్ వర్శిటీ ప్రొఫెసర్ హోమీ భాభా కీలక ఉపన్యాసం చేస్తారు.