అంతర్జాతీయం

సిద్ధూ శాంతిదూత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 21: పాకిస్తాన్ ప్రధానిగా తన ప్రమాణస్వీకారానికి హాజరైన మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూను శాంతిదూతగా ఇమ్రాన్‌ఖాన్ అభివర్ణించారు. సిద్ధూ వ్యవహారాన్ని తప్పుబడుతున్న వారిపై ఇమ్రాన్ తీవ్రస్వరంతో ధ్వజమెత్తారు. సిద్ధూను విమర్శించడం ద్వారా వీరంతా ఉపఖండంలో శాంతి విఘాతక చర్యలకు పాల్పడుతున్నారని ఇమ్రాన్ అన్నారు. పాకిస్తాన్ సైనిక జనరల్ జావెద్ భజ్వాను కౌగిలించుకున్నందుకు సిద్ధూపై భారత్‌లోని అనేక రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భారత్, పాక్ దేశాలు కాశ్మీర్, ఇతర అంశాలపై తమ విభేదాలు, సమస్యలను పరిష్కరించుకోవడానికి, రెండింటి మధ్య వాణిజ్య బంధం ఏర్పడటానికి ఇరుదేశాల మధ్య చర్చలు జరపాలని ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. ఉపఖండంలోని పేదరికం తొలగించి, వారిని అభివృద్ధి చేయడానికి వాణిజ్య సంబంధాలు, చర్చలొకటే మార్గమని అన్నారు. పాకిస్తాన్ పొరుగుదేశాలతో ఎప్పుడూ సత్సంబంధాలనే కోరుకుంటుందని ఖాన్ నిన్న పేర్కొన్నారు. కాగా పాక్ సాధారణ ఎన్నికల్లో జూలై 26న ఖాన్ ప్రసంగిస్తూ తాము అధికారంలోకి వస్తే భారత్‌తో సంబంధాలు పెంచుకోవడానికి సిద్ధమేనని, ఆ దేశ నాయకులతో చర్చలు జరిపి విభేదాలు పరిష్కరించుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యం గా రెండు దేశాల మధ్య అతి ముఖ్యమైన కాశ్మీర్ సమస్య కేవలం చర్చల ద్వారానే పరిష్కారమవుతుందని ఆయన అన్నారు. వాళ్లు ఒక అడుగు ముందుకు వస్తే తాను రెండడుగులు ముందుకు వేస్తానని కూడా ఆయన భారత్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు, వాణిజ్య సంబంధాలు పెరిగితేనే ఇరుదేశాలకు ప్రయోజనం చేకూరుతుందని
ఆయన అన్నారు. కాగా, అధికారిక లెక్కల ప్రకారం ఇరుదేశాల మధ్య మొత్తం జరుగుతున్న వ్యాపారంలో 0.31 శాతం మాత్రమే ఎగుమతి, దిగుమతులు జరుగుతున్నాయి. 2012లో ఇండియా నుంచి దిగుమతి చేసుకోదగిన వస్తువుల సంఖ్య 1950గా పేర్కొంది. అలాగే 1209 రకాల వస్తువులను దిగుమతి చేసుకోరాదంటూ నిషేధం విధించింది. ఇటీవల ఇరుదేశాల మధ్య జరిగిన పరిణామాల నేపథ్యంలో సంబంధాలు దెబ్బతిన్నాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు భారత్‌పై దాడులకు పూనుకోవడం, పాక్‌లో భారత్ దళాలు సర్జికల్ దాడులు చేయడం, భారత్‌కు చెందిన కులభూషణ్ జాదవ్‌కు ఆ దేశ మిలటరీ కోర్టు మరణ శిక్ష విధించడం తదితర పరిణామాల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అంతేకాకుండా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ సైనికులు భారత్ భద్రతా దళాలు, పౌరులపై దాడులు చేసి చంపడంపై భారతదేశం ఆగ్రహంగా ఉంది.