అంతర్జాతీయం

ఇంద్రా నూయాకి అరుదైన గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఆగస్టు 25: పెప్సికో కంపెనీ సీఈవోగా పనిచేస్తున్న భారత సంతతికి చెందిన మహిళ ఇంద్రానూరుూని గేమ్‌చేంజర్ ఆఫ్ ది ఇయర్-2018 అవార్డు వరించింది. వ్యాపార రంగంలో ఆమె సాధించిన లక్ష్యాలు, మానవతా విలువలు, ప్రపంచ వ్యాప్తంగా మహిళలు, చిన్నారుల ప్రగతికి చేయూత వంటి అంశాల ఆధారంగా ఓ అంతర్జాతీయ స్థాయి సాంస్కృతిక సంస్థ ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ప్రతి యేడాది అక్టోబర్‌లో ఆసియా గేమ్ చేంజర్ అవార్డును వ్యకులకు, లేదా సంస్థలకు వారి అసమాన ప్రతిభాపాటవాలకు, ధీరత్వానికి, వృత్తిలో అద్భుతాల సాధనకు, సాటివారిలో స్ఫూర్తిని నింపినందుకు గుర్తింపుగా ఈ సంస్థ అందజేయడం జరుగుతోంది. ఇంద్రానూరుూ మానవతా విలువలు పుణికిపుచుకున్న నిజమైన నాయకురాలని, ఈ విషయాన్ని తాను యునైటెట్ నేషన్స్‌లో పనిచేసినపుడు స్వయంగా తెలుసుకున్నానని కల్చరల్ సొసైటీ సీఈఓ జోసెట్ షీరన్ తెలిపారు. మహిళా సాధికారత, బలవర్ధక ఆహారం, ప్రపంచ పర్యావరణ సమతౌల్యం, నీటి కాలుష్య నివారణ తదితర ప్రజాజీవన ప్రమాణాల రక్షణ చర్యలను అమెరికాప్రభుత్వంతో కలిసి పెప్సీ సంస్థ చేపట్టగా నూరుూ ఎంతో ప్రతిభా పాటవాలను కనబరిచారని జోసెట్ పీరన్ తెలియజేశారు. పలుమార్లు మహిళల సమస్యలపై పోరాటాలు సాగినపుడు పలు చర్చావేదికల్లో ఆమె ఉద్యమించే ఒక మహిళాగ్రూపునకు నాయకత్వం వహించారన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని బాలికల రోబోటిక్ టీం అంతర్జాయ పోటీల్లో ఏర్పరచిన ప్రకంపనాలు, నేపాల్‌లోని చిన్న గ్రామం నుంచి వచ్చి పరుగు పందెంలో వినూత్న రికార్డులు నెలకొల్పిన మీరా రాయ్ వంటివారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలు, యువతులకు స్ఫూర్తిదాయకమని ఆయన గుర్తుచేసుకున్నారు. కాగా నూరుూ తన పనె్నండేళ్ల కాల పెప్సీ సీఈవో పదవిని వదులుకోబోతున్నట్లు ఈ నెల తొలినాళ్లలో ప్రకటించడం జరిగింది.