అంతర్జాతీయం

మతతత్వ శక్తులను తిప్పికొట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 25: వచ్చే ఎన్నికల్లో బీజేపీకి, ప్రతిపక్ష పార్టీల కూటమికి మధ్య హోరాహోరీ పోటీ జరుగుతుందని, దేశంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు మతతత్వ శక్తులు చేస్తున్న ప్రయత్నాలను తిప్పిగొడతామని ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. 1984లో సిక్కుల ఊచకోత బాధాకరమైన విషాదఘట్టమని ఆయన పేర్కొన్నారు. ఈ దురాగతాలకు బాధ్యులైన వారిని వంద శాతం కఠినంగా శిక్షించాల్సిందేనని ఆయన చెప్పారు. ఇక్కడ నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్, పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. దీంతో యుకె పార్లమెంటు సభ్యులతో కూడా ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించడమే తమ పార్టీ లక్ష్యమని, భారతీయ వ్యవస్థలను పరిరక్షిస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఇరు పక్షాల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది. ఒక వైపు బీజేపీ పక్షం, మరోవైపు బీజేపీని వ్యతిరేకించే పక్షాలు మొహరించి ఉంటాయి. భారతదేశాన్ని, ఇక్కడి విలువలు, వ్యవస్థలను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని ఆయన చెప్పారు. భారత రాజ్యాంగంపై దాడి జరుగుతోందని, కాంగ్రెస్ పార్టీ ఈ చర్యలను చూస్తూ ఊరుకోబోదన్నారు. హింసను ఏ రూపంలో ఉన్న తీవ్రంగా ఖండిస్తామని, హింసకు బలైన కుటుంబం తమదని ఆయన చెప్పారు. బీజేపీ ప్రభుత్వం అణచివేత ధోరణులను అవలంభిస్తోందన్నారు. స్వాతంత్య్రపోరాటంలో వేలాది మంది త్యాగాల వల్ల సాధించిన స్వాతంత్య్రాన్ని పరిరక్షించుకుంటామన్నారు. భారత్‌ను ఈ రోజు నిరుద్యోగ సమస్య కబళిస్తోందన్నారు.
సిక్కుల ఊచకోత పెద్ద విషాదకరం..
భారత్‌లో 1984లో జరిగిన సిక్కుల ఊచకోత సంఘటనలు చరిత్రలో పెద్ద విషాదమని ఎఐసీసీ అధ్యక్షుడు రాహల్ గాందీ అన్నారు. యుకె పార్లమెంటు సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ హత్యానంతరం ఈ అల్లర్లు చెలరేగాయన్నారు. ఈ ఘటనల్లో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్రమేయం లేదన్నారు. హింస ఏ రూపంలో ఉన్నా సహించే ప్రసక్తిలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ అల్లర్లకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షపడాలని, తమ దేశంలో కోర్టులు ఈ ఘటనలపై విచారిస్తున్నాయని చెప్పారు. మా కుటుంబం కూడా హింసకు బలైందని ఆయన చెప్పారు. 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. భారత్‌లోనే కాదు. భూమండలంలో హింస అనేది ఎక్కడ ఉన్నా దానిని సహించే ప్రసక్తిలేదన్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదన్నారు. నా తండ్రి రాజీవ్ గాంధీ హత్యకు కారణమైన ఎల్‌టీటీఇ అధినేత ప్రభాకరన్ కూడా హత్యకు గురయ్యాడు. ప్రతి మరణం బాధిస్తుందని ఆయన చెప్పారు. ప్రభాకరన్ చనిపోయినప్పుడు చూశాను. నా తండ్రి కూడా మరణించారు. నేను ఎలా రోదించానో, ప్రభాకరన్ పిల్లలు కూడా అంతే దుఃఖానికి లోనయ్యారు. హింసకు బలైన వారి కుటుంబాల్లో అందరి బాధ ఒకే విధంగా ఉంటుంది అని రాహుల్ గాంధీ అన్నారు. హింస దుర్మార్గమైనదని, దీనిని చాలా మంది ప్రజలు అర్థంచేసుకోలేరన్నారు. వచ్చే ఎన్నికల్లో మతతత్వశక్తులపై విజయం సాధించి తీరుతామని ఆయన అన్నారు.
బ్రిటన్‌లో భారతీయులు ఎదుర్కొంటున్న వీసాల సమస్యలపై యుకె పార్లమెంటు సభ్యులతో రాహుల్ గాంధీ చర్చించారు. ప్రాంతీయ, ద్వైపాక్షిక, అభివృద్ధి, నిరుద్యోగం, వాణిజ్యం తదితర అంశాలపై ఆయన లేబర్ పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెచ్చుమీరుతున్న ఉగ్రవాదం వల్ల మానవాళికి నష్టం చేకూరుతోందని రాహుల్ గాంధీ చర్చల్లో ప్రస్తావించారు. బ్రిటన్-్భరత్ మధ్య సంబంధాలు బలోపేతం కావాలని ఆకాంక్షించారు.