అంతర్జాతీయం

భారత్‌లో ఎఫ్-16 జెట్ యుద్ధ విమానాల రెక్కల తయారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 4: లఖీద్‌మార్టిన్స్ ఎఫ్-16 జెట్ యుద్ధ విమానాల రెక్కల తయారీ భారతలో జరుగనుందని అమెరికాకు చెందిన సెక్యూరిటీ, అంతరిక్ష, వైమానిక దిగ్గజ కంపెనీ మంగళవారం నాడిక్కడ ప్రకటించింది. భారత ప్రభుత్వ మేకిన్ ఇండియా పిలుపునకు స్పందనగా మేరీల్యాండ్‌లోని లఖీద్‌మార్టిన్ సంస్థ భారత్‌లోని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్‌తో ఈమేరకు ఒప్పందం కుదుర్చుకుందని ఆ సంస్థ అధికారులు ఇక్కడ తెలిపారు. మొత్తం జెట్ యుద్ధ విమానాల తయారీని భారత్‌లో చేపట్టాల్సిందిగా లఖీద్‌మార్టిన్స్ సంస్థ ఆఫర్ ఇచ్చినప్పటికీ దీనిపై ఆ ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రావాల్సివుందని, ప్రస్తుతానికి విమాన రెక్కలు మాత్రం భారత్‌లో రూపొందించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. దీంతో భారత్‌తో తమ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింతగా బలపడుతుందన్నారు. భవిష్యత్తులో టాటా సంస్థతో సి-130జె సూపర్ హెర్కులస్ ఎయిర్ లిఫ్టర్, ఎస్-92 హెలికాప్టర్ల తయారు చేసేందుకు తమ సంస్థ ముందుకెళ్లేందుకు ఇది దోహదం చేస్తుందని లఖీద్‌మార్టిన్స్ వ్యాపారాభివృద్ధి, వ్యూహం విభాగం ఉపాధ్యక్షుడు వివేక్‌లాల్ తెలిపారు. భారత వైమానికి దళంలో వినియోగించే ఎఫ్-16 జెట్ యుద్ధ విమానంలో మొత్తం 70 అత్యాధునిక ఫీచర్లు ఉంటాయని, ఒక ఎలక్రానిక్ స్కాన్డ్ ఆరీ రాడార్ (ఎఈఎస్‌ఏ), మరో ఆధునిక కాక్‌పిట్, అత్యాధునిక ఆయుధాలు, అనువైన ఇంధన ట్యాంకులతోబాటు ఆటోమేటిక్ గ్రౌండ్ కొలీషన్ ఆవాయ్‌డెన్స్ (విమానం నేలను ఢీకొనే ప్రమాదంలో రక్షించే) అత్యాధునిక సిస్టంలు ఉంటాయని తెలిపారు. ఇప్పటి వరకు 4,604 ఎఫ్=16 జెట్ విమానాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ 28 మంది కస్టమర్ల ద్వారా తయారు చేయించామని, ఇందులో ప్రస్తుతం మూడు వేల విమానాలు ఎగురుతున్నాయని లఖీద్‌మార్టిన్స్ అధికారులు వివరించారు.