అంతర్జాతీయం

పాక్ కొత్త అధ్యక్షుడిగా ఆరిఫ్ అల్వీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 4: పాకిస్తాన్ కొత్త అధ్యక్షుడిగా డాక్టర్ ఆరిఫ్ అల్వీ (69) ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన డాక్టర్ ఆరీఫ్ దేశ 13వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నిక కోసం పోటీపడిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అభ్యర్థి అయితాజ్ అహ్‌సన్, పాకిస్తాన్ ముస్లిం లీగ్-ఎన్ ప్రతిపాదించిన అభ్యర్థి వౌలానా ఫాజుల్ ఉర్ రెహ్మాన్‌లను ఓడించి ఆరిఫ్ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. జాతీయ అసెంబ్లీతోపాటు సెనేట్‌లో మొత్తం 430 ఓట్లు పోల్ కాగా అందులో డాక్టర్ ఆరిఫ్ అల్వీకి 212 ఓట్లు, రెహ్మాన్‌కు 131, అహ్‌సన్‌కు 81 ఓట్లు వచ్చాయి. ఆరు ఓట్లను తిరస్కరించారు. డాక్టర్ అల్వీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీకి 2006 నుంచి 2013 వరకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈ ఏడాది జూలైలో జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆయన కరాచీ నుంచి ఎన్నికయ్యారు. కాగా, ప్రస్తుతం దేశాధ్యక్షుడిగా కొనసాగుతున్న మామ్‌నూన్ హుస్సేన్ పదవీకాలం ఈనెల 8వ తేదీతో ముగుస్తుంది.