అంతర్జాతీయం

అణు నిరాయుధీకరణపై ఉత్తర, దక్షిణ కొరియా భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్: అణు నిరాయుధీకరణపై చర్చించేందుకు వీలుగా దక్షిణ కొరియా రాయబారి నాయకత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం బుధవారం పియాంగ్‌యాంగ్‌లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జింగ్ ఉన్‌తో భేటీ అయ్యారు. ఐదుగురు సభ్యులు కలిగిన దక్షిణ కొరియా బృందానికి ఆ దేశ అధ్యక్షుడు మూన్ జాయె-ఇన్‌కు సంబంధించిన ప్రత్యేక రాయబారి ఛుంగ్ ఎయి-యంగ్ నాయకత్వం వహించారు. ఉత్తర కొరియా అధ్యక్షుడితో జరిగే భేటీలో అణ్వస్త్రాలను పూర్తిగా నిరోధించడం, తద్వారా కొరియా ద్వీపకల్పం ప్రాంతంలో శాంతియుత వాతావరణం కల్పించేందుకు వీలుగా చర్చలు జరుపనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తమ దేశ అధ్యక్షుడు మూన్ అణ్వస్త్ర నిరాయుధీకరణపై సుదీర్ఘంగా రాసిన లేఖతో పాటు ఇందుకు అనుగుణంగా తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు వీలుగా ప్రతినిధి బృందం ఉత్తర కొరియా అధ్యక్షుడిగా అందజేశారు. ఈ విషయాన్ని ఉత్తర కొరియా అధ్యక్షుడి కార్యాలయ అధికార ప్రతినిధి సియోల్‌లో మీడియాకు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌తో కొరియా ద్వీపకల్పంలో అణ్వస్త్ర నిరాయుధీకరణపై ఈ ఏడాది జూన్‌లో జరిపిన చర్చలు ద్వారా ఇప్పటివరకు కొద్దిపాటి కదలిక వచ్చిందని పేర్కొన్నారు. తొలి సమావేశంలో జరిగిన చర్చల్లో తగిన పురోగతి లేనందువల్ల మలి సమావేశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.