అంతర్జాతీయం

పెంపుడు కుమార్తె మృతి కేసులో దంపతుల ఓవర్సీస్ కార్డుల రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హౌస్టన్, సెప్టెంబర్ 8: మూడేళ్ల పెంపుడు కుమార్తె షేరీన్ మ్యాథ్సూ మృతి కేసులో ఇండో అమెరికన్ దంపతుల తీరుపై కఠినంగా వ్యవహరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. వెస్లీ మ్యాథ్స్యూ, అతని భార్య సినీకి సంబంధించి ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా కార్డులను రద్దు చేయాలని నిర్ణయించినట్లు హౌస్టన్ కౌనె్సల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుపమ్ రే చెప్పారు. ఈ పాప డల్లాస్‌లో ఇంటి నుంచి తప్పిపోయింది. కాగా కొన్ని రోజుల తర్వాత ఇంటికి సమీపంలోని కల్వర్టులో శవమై తేలింది. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో దత్తత ప్రక్రియ నిబంధనలను కఠిన తరం చేయాలని భారత్ నిర్ణయించింది. ఈ ఘటన గత ఏడాది అక్టోబర్ 22న జరిగింది. మ్యాథ్స్యూకు సంబంధించిన భారత్‌లో స్నేహితులుగా ఉన్న మనోజ్ ఎన్ అబ్రహం, నిస్సే టి అబ్రహంకు నోటీసులు ఇవ్వనున్నట్లు అనుమమ్ రే చెప్పారు. కాగా నోటీసులను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని వీరు ఢిల్లీ కోర్టులో సవాలు చేశారు. కాగా పసిపాప హత్యకు గురైందని పోలీసులు నిర్ధారించిన నేపథ్యంలో ఈ కేసు పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుని భారత ప్రభుత్వానికి తెలియచేస్తున్నట్లు రే చెప్పారు. పసిపాప షేరీన్ హత్యకు గురైందని పోలీసులు నిర్ధారించారన్నారు. కాగా పసిపాప పాలు తాగనని మారం చేసినందుకు ఇంటి బయట ఉదయం 3 గంటల ప్రాంతంలో వదిలానని ఆ పాప పెంపుడు తండ్రి వెస్లీ పోలీసులకు చెప్పారు. ప్రస్తుతం వీరు అమెరికా జైల్లో ఉన్నారు.