అంతర్జాతీయం

నాడు నిక్సన్.. నేడు ట్రంప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 9: అమెరికా చరిత్రలో అప్రతిష్టపాలైన అధ్యక్షుడు నిక్సన్ కాలం నాటి చీకటి రోజులు మళ్లీ వస్తున్నాయా ? నిక్సన్‌ను వాటర్ గేట్ కుంభకోణం మింగేసింది. ఈ స్కాం వల్ల నిక్సన్ అమెరికా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో నిక్సన్ అప్రతిష్టపాలయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌కు నిక్సన్ పట్టిన గతే పడుతుందా ? అమెరికాలో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. నిక్సన్‌పై వాటర్‌గేట్ కుంభకోణంలో అనేక అభియోగాలు వచ్చాయి. అప్పుడు నిక్సన్ వ్యవహరించిన తీరు, ఇప్పుడు ట్రంప్ ధోరణి ఒకేలా ఉన్నాయని జాన్ డీన్ అనే విశే్లషకులు పేర్కొన్నారు. ట్రంప్ ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను, అవరోధాలు నిక్సన్ హయాంలో తలెత్తాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కూడా వాటర్‌గేట్ స్పెషల్ ప్రాసిక్యూటర్ విమర్శలను తిప్పిగొట్టేందుకు మొదట అటార్నీ జనరల్‌ను ఆ తర్వాత డిప్యూటీ అటార్నీజనరల్‌ను ఆదేశించాడని జాన్ డీన్ అన్నారు. కాని నిక్సన్ ఆదేశాలను పాటించేందుకు నిరాకరించారు. స్పెషల్ ప్రాసిక్యూటర్ ముల్లర్ చేస్తున్న వాదనలను,ట్రంప్‌పై వచ్చిన అభియోగాలను తిప్పిగొట్టేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. నిక్సన్ మాదిరిగా ట్రంప్ కూడా అటార్నీ జనరల్, ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ను గట్టిగా వాదించాలని ఆదేశించారు. ఆ రోజుల్లో నిక్సన్ వాటర్ గేట్ స్కాంను వుడ్‌వార్డ్, కార్ల్‌బెర్న్‌స్టెన్‌లు బహిర్గతం చేశారు. వుడ్‌వర్డ్ రాసిన కొత్త పుస్తకం ఫియర్‌లో వైట్ హౌస్‌లో జరుగుతున్న పరిణామాలపై ఆసక్తికరమైన విశేషాలను ప్రస్తావించారు. ప్రతి ఒక్కరు ఏదో విధంగా నన్ను టార్గెట్ చేయాలనుకుంటున్నారంటూ ట్రంప్ అన్న మాటలు సర్వత్రా ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఈ రోజు ట్రంప్‌కు చెందిన కీలక నేతలు కూడా ట్రంప్‌ను పిచ్చిప్రేలాపనలు చేస్తున్న వ్యక్తిగా అభివర్ణిస్తున్నారు. నిక్సన్ హయంలో కూడా అప్పటి టాప్ లెఫ్టినెంట్ హెన్రీ కిసింజర్ నిక్సన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఇటీవల ఒక ప్రకటన చేస్తూ కొంత మంది అనుమానస్పద వ్యక్తులపై జస్టిస్ శాఖ విచారణ చేయాలన్నారు. నిక్సన్ కూడా ఫెడరల్ యంత్రాంగంలో రాజకీయ శత్రువుల కదలికలు ఎలా తెలుసుకోవాలో ఉపయోగించుకోవాలన్నారు. ప్రాసిక్యూషన్, లిటిగేషన్‌ను ఉపయోగించుకోవడం, రాజకీయ ప్రత్యర్థుల కాంట్రాక్టులను నిలిపివేయడం తదితర అంశాలపై నిక్సన్ అనుచరులు దృష్టినిసారించడం వివాదస్పదంగా మారింది. నిక్సన్‌కు విదేయుడుగా ఉన్న లాయర్ డీన్ కూడా చివరకు నిక్సన్‌కు దూరంగా జరిగారు. నిక్సన్ శత్రువుల జాబితాను తయారుచేసి నిక్సన్‌కు సహాయపడిన డీన్ కూడా చివరకు నిక్సన్ చర్యలతో విసుగెత్తిపోయారు. ప్రస్తుతం ట్రంప్ పాలన చూస్తుంటే ఏ క్షణం ఏమవుతుందో, ఏ స్కాం విస్ఫోటనంలా పేలుతుందోనన్న అనుమానాలు మీడియాలో, మేధావి వర్గాల్లో వ్యక్తమవుతోంది.