అంతర్జాతీయం

హిందుత్వాన్ని పరిరక్షించుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చికాగో, సెప్టెంబర్ 10: హిందూ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాడు పిలుపునిచ్చారు. వరల్డ్ హిందూ కాంగ్రెస్(డబ్ల్యూహెచ్‌సీ) ముగింపుసమావేశంలో ఉప రాష్ట్రపతి కీలక ఉపన్యాసం చేశారు. ‘హిందూ అన్న పదమే అంటరానిదిగా ఉచ్ఛరించడమే తప్పు అన్నట్టుగా కొందరు ప్రవర్తిస్తున్నారు’అని ఆయన విమర్శించారు. ఇలాంటి ప్రయత్నాలను తిప్పికొట్టాలన్న ఉపరాష్టప్రతి ‘స్వామి వివేకానంద వంటి మహానీయులు బోధనలే అనుసరణీయం’ అని స్పష్టం చేశారు. భారత్ సర్వమత సహహాన్ని కోరుకుంటుందని, ఆ దిశగానే ముందుకెళ్తోందని ఆయన అన్నారు. అసహనం అన్నదే లేదని భారత్‌లో అన్ని మతాలు గౌరవించబడుతున్నాయని ఉప రాష్టప్రతి తెలిపారు. డబ్ల్యూహెచ్‌సీకి వేదికైన చికాగోలోనే స్వామి వివేకానంద చారిత్రాత్మకమైన ప్రసంగం చేశారని ఆయన గుర్తుచేశారు.
1893లో వివేకాందుడు ఇక్కడ ప్రసంగించారు. మూడు రోజుల పాటు ఇక్కడ జరిగిన ప్రపంచ హిందూ సమ్మేళన్‌లో 60 దేశాల నుంచి వచ్చిన 250 మంది ప్రముఖులు హిందూ ఐక్యతపై మాట్లాడారు. 2, 500 మంది ప్రతినిధులు హాజరైన సదస్సులో ఉప రాష్ట్రపతి ముగింపు ఉపన్యాసం చేశారు. ‘హిందుత్వాన్ని పంచుకుందాం.. కాపాడుకుందాం’అని ఆయన పిలుపునిచ్చారు. హిందుత్వాన్ని దెబ్బతీయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచమంతా ఓ కుటుంబం అని బోధించేది ఒక్క హిందు మతమేమని ఆయన తెలిపారు. హిందూ ఔన్నత్యం ఎంతో గొప్పదన్న ఉపరాష్టప్రతి దాన్ని పరిరక్షణకు అందరమూ కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేశారు.