అంతర్జాతీయం

లగ్జరీ కార్లు అమ్మేస్తున్న ఇమ్రాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 17: పాకిస్తాన్‌లో ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు లగ్జరీ కార్లను వేలానికి పెట్టింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వాన్ని గట్టెకించడానికి ఇమ్రాన్ ప్రభుత్వం పలు పొదుపుచర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం వద్ద ఉన్న లగ్జరీ కార్లను సోమవారం వేలం వేశారు. 34 కార్లను విక్రయించారు. మొత్తం 102 కార్లను వేలానికి పెట్టారు. అమ్మకానికి పెట్టిన కార్లలో అత్యధిక ఖరీదైనవీ ఉన్నాయి. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలూ వేలానికి ఉంచినట్టు జియో న్యూస్ వెల్లడించింది. అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వాన్ని గట్టెకించాలంటే ఇదొక్కటే పరిష్కారమని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం భావించింది.
విలాసవంతమైన కార్లే కాకుండా మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ హయాంలోని గేదెలను వేలం వేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అవినీతి ఆరోపణల్లో ప్రధాని పదవిని కోల్పోయిన నవాజ్ షరీఫ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. అలాగే నిరుపయోగంగా ఉన్న నాలుగు హెలీకాప్టర్లు అమ్మేయాలని నిర్ణయించినట్టు ఇమ్రాన్‌కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ఒకరు గత వారం వెల్లడించారు. సోమవారం నాడు 34 లగ్జరీ కార్లు వేలంలో అమ్ముడైనట్టు ప్రధాని రాజకీయ వ్యవహారాలు చూసే ప్రత్యేక సహాయకుడు నరుూమ్ ఉల్ హక్ తెలిపారు. రెండోదశలో 41 విదేశీ కార్లను వేలం వేయనున్నారు. వేలాని పెట్టిన కార్లలో కొత్త మోడల్స్ ఉన్నాయి. మెర్సిడెజ్ బెంజ్ కార్లు నాలుగు, ఎనిమిది బుల్లెట్ ప్రూఫ్ బీఎండబ్యూలు, మూడు 5000 సీసీ ఎస్‌యూవీలు, రెండు 3000 సీసీ ఎస్‌యూవీలు (2016 మోడల్) ఉన్నాయని జియో న్యూస్ వెల్లడించింది.
అలాగే 2016 మోడల్ మెర్సిడెస్ బెంచ్ కార్లు 24, 4000 సీసీ బులెట్ ప్రూఫ్ వాహనాలు 24 వేలానికి ఉంచారు. ఇవికాక 40 టయోటా కార్లు, ఓ లగ్జరీ ఎస్‌యూవీ, రెండు లేండ్ క్రూసెర్స్ విక్రయించనున్నారు. ఎనిమిది సుజుకీ కార్లు, ఐదు మిట్సుబిషీ వాహనాలు, తొమ్మిది హోండాలు, రెండు జీప్‌లు వేలానికి ఉంచారు. ఎవరు ఎక్కువ బిడ్ దాఖలు చేస్తే వారికే వాహనాలు విక్రయిస్తారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇమ్రాన్‌ఖాన్ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత జాతిని ఉద్దేశించి చేసిన తొలి ప్రసంగంలోనే ‘ప్రభుత్వం విభాగాల్లో దుబారాను అరికడతానని’ ప్రకటించారు. ఇందులో భాగంగానే ప్రధాని నివాసంలో నిరుపయోగంగా ఉన్న వాహనాలను అమ్మేస్తామని వెల్లడించారు. పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. సుమారు 30 ట్రిలియన్ రూపాయల మేర అప్పులున్నట్టు తేలింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ (ఎస్‌బీపీ) గత నెలలో వెల్లడించిన గణాంకాల ప్రకారం అప్పులు కుప్పలుగా పెరిగిపోయాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే దుబారాను అరికట్టడంతోపాటు విలాసవంతమైన కార్లను వేలం వేయాల్సి వస్తోందని ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ వెల్లడించింది.